Site icon Prime9

Anil Kumar Yadav :అయ్యప్పదీక్ష.. ముస్లింటోపీ.. అనిల్ కుమార్ యాదవ్ పై మండిపడుతున్న బీజేపీ నేతలు

Anil Kumar Yadav

Anil Kumar Yadav

Anil Kumar Yadav: వైసీపీ ఎమ్మెల్యే , మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వివాదంలో చిక్కుకున్నారు. అయ్యప్ప దీక్షలో వుండి ముస్లిం టోపీ, కండువా ధరించడం వివాదాస్పదమైంది. నెల్లూరు నగరంలోని ఖుద్దూస్ నగర్‌లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా అనిల్ కుమార్ యాదవ్ ఇంటింటికి తిరిగారు. ఈ ప్రాంతంలో ముస్లింల ప్రాబల్యం ఎక్కువగా వుండటంతో ముస్లిం టోపీ, కండువా ధరించారు. దీనికి సంబంధించి ఫోటోలు , వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బీజేపీ నేతలు మండిపడుతున్నారు.

బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. స్వామి అయ్యప్ప దీక్షలో ముస్లింల టోపీ, కండువా వేసుకుని భక్తుల్ని అవమానించారని వారు మండిపడ్డారు. దీక్ష నియమాలు పాటించని ఎమ్మెల్యేను శబరిమల వెళ్లకుండా అడ్డుకోవాలని వారు పిలుపునిచ్చారు. అలాగే హిందువుల మనోభావాలను దెబ్బతీసినందుకు అనిల్ కుమార్ యాదవ్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా వారు డిమాండ్ చేశారు. ఓట్ల కోసం ఇంత బరితెగించాల్సిన అవసరం లేదని వారు చురకలంటించారు.

Exit mobile version