AP: కాకినాడ జిల్లా తుని సీటు విషయంలో యనమల సోదరుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. తుని టీడీపీ సీటు కూతురికి ఇస్తున్నట్లు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సంకేతాలు ఇచ్చారు. దీంతో మాజీ మంత్రిపై తమ్ముడు కృష్ణుడు ఘాటుగా స్పందించారు. దీనిపై తుని టీడీపీ ఇంఛార్జ్ యనమల కృష్ణుడు, తొండంగి టీడీపీ నేత మధ్య ఫోన్ కాల్ సంభాషణ బయటపడింది.
యాదవ సామాజికవర్గంలో 30 వేల ఓట్లు ఉన్నాయి, నేను లేకపోతే వాళ్లను ఎవరూ పట్టించుకోరు. యనమల రామకృష్ణుడు కూతురు దివ్య ఇంట్లో ఉంటుంది. ఈసారి సీటు యనమల కృష్ణుడికి ఇవ్వక్కర్లేదు కానీ నా కూతురికి ఇవ్వనని రామకృష్ణుడిని చెప్పమనండి. ఈసారి వైసీపీ రాజా నెగ్గేస్తున్నాడని అందరూ అంటున్నారు. కృష్ణుడు కష్టపడితే కూతురుకు సీటు ఇస్తారా అని అడగండి. ఊరికి 40 మంది కలిసి వెళ్లి యనమల రామకృష్ణుడిని ప్రశ్నించండి. కృష్ణుడు లేకపోతే తునిలో టీడీపీ ఉండదని యనమల రామకృష్ణుడుకి గట్టిగా చెప్పండి.” అని యనమల కృష్ణుడు మాట్లాడినట్లు ఆడియో వైరల్ అవుతోంది. అయితే టీడీపీ కార్యకర్తలు కొందరు దీనిని తప్పుడు ప్రచారంగా కొట్టిపారేస్తున్నారు. ఈ విషయంపై యనమల కృష్ణుడు స్పందించవలసి ఉంది.