Arogyasri in A.P: ఏపీలో కొనసాగనున్న ఆరోగ్యశ్రీ సేవలు

పాత బకాయిలు చెల్లించక పోవడంతో ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేసిన సంగతి తెలిసిందే .దింతో కొంత బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది .అయినప్పటికీ ఆస్పత్రుల యాజమాన్యం అసోసియేషన్ మొత్తం బకాయిలను చెల్లించాలని పట్టుపట్టింది.

  • Written By:
  • Publish Date - May 25, 2024 / 04:51 PM IST

Arogyasri in A.P: పాత బకాయిలు చెల్లించక పోవడంతో ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేసిన సంగతి తెలిసిందే .దింతో కొంత బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది .అయినప్పటికీ ఆస్పత్రుల యాజమాన్యం అసోసియేషన్ మొత్తం బకాయిలను చెల్లించాలని పట్టుపట్టింది. ప్రభుత్వం చర్చల ద్వారా ఆస్పత్రుల యాజమాన్యాలను ఒప్పించింది .దింతో గత మూడు రోజులనుంచి ఆరొగ్య సేవలు అందుతున్నాయని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఒక ప్రకటన అవిడుదల చేసింది .ఏపీలోవైయస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా అందరికీ సకాలంలో వైద్యం అందుబాటులో ఉందని , రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాలలోని గుర్తింపు పొందిన ఆస్పత్రులలో కూడా ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయించుకునేందుకు వెసులుబాటు ఉందని ఆ ప్రకటనలో తెలియచేసింది .

రోజుకు 5349 మందికి లబ్ది..(Arogyasri in A.P.)

ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి గత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ. 3,566.22 కోట్లు నెటవ్ర్క్ ఆసుపత్రుల ఖాతాలలో జమ చేయటం జరిగిందని పేర్కొన్నారు . అంతేకాకుండా ఈ ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలలలో ఇప్పటివరకు రూ. 366.00 కోట్లు నెటవ్ర్క్ ఆసుపత్రుల ఖాతాలలో జమచేయటం జరిగిందని తెలిపారు .గత ఒక సంవత్సర కాలంలో, రాష్ట్రంలో రోజుకి సగటున 5349 మంది లబిద్దారులు ఆరోగ్య శ్రీ పథకం కింద చికిత్స పొందుతున్నారని వివరించారు . ఈ నెల 22న, 6718 లబిద్దారులకు 23న 7118 లబిద్దారులకు ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స పొందారని పేర్కొన్నారు .ఆరోగ్యశ్రీ లబిద్దారులకు , ఆరోగ్య శ్రీ సేవలకు అంతరాయం కలిగించకుండ సహకరించాలనే పిలుపుకు ఆసుపత్రుల నెట్ వర్క్ యాజమాన్యం సానుకూలంగా స్పందించింది . ఈ మేరకు ఒక ప్రకటన కూడా విడుదల చేసింది .