ArogyaSri: ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు వస్తున్న వార్తలు సంచలనం కలిగిస్తున్నాయి . తమకు ఇవ్వాల్సిన రూ.1500 కోట్ల బకాయిల్ని ప్రభుత్వం చెల్లించని కారణంగా ఈ నెల 22 నుంచి ఆరోగ్య శ్రీ సేవల్ని నిలిపివేస్తున్నట్లుగా ప్రైవేటు ఆసుపత్రుల వర్గాలు వెల్లడించాయి. పేద ప్రజలకు సైతం ప్రైవేటు ఆసుపత్రుల్లో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందేందుకు వీలు కల్పించే విధంగా వైఎస్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చింది .దానిని జగన్ సర్కారు వైఎస్సార్ ఆరోగ్యశ్రీగా మర్చి అమలుజరుపుతున్నారు . ఈ పథకం ద్వారా పేదలకు ఉచితంగా ప్రైవేటుఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవల్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా తమకు భారీగా మొత్తంలో బకాయిలు పెండింగ్ లో పడ్డాయని.. వాటిని చెల్లిస్తేనే తాము ఆరోగ్య శ్రీ సేవల్ని కొనసాగంచలేమంటూ తాజాగా ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో తాము అందిస్తున్న నాణ్యమైన వైద్య సేవల్ని 22 నుంచి కొనసాగించలేమని.. బుధవారం నుంచి ఈ పథకం కింద వైద్య సేవల్ని అందించమన్న విషయాన్ని గుర్తించాలని ఆ లేఖలో పేర్కొన్నారు.
ఎప్పటి నుంచో బిల్లులు పెండింగ్..(ArogyaSri)
ఈ పథకం కింద 2023 ఆగస్టు నుంచి తాము అందించిన వైద్య సేవలు కు ఇప్పటివరకు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని ప్రైవేటు ఆసుపత్రుల యజమానులు చెబుతున్నారు . తమకు రావాల్సిన బకాయిల గురించి ఎన్నిసార్లు ప్రభుత్వానికి విన్నవించినా తమకు నిధులు విడుదల చేయని కారణంగా.. వైద్య సేవల్ని నిలిపివేయాలన్న నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి లిఖిత పూర్వకంగా లేఖ రాశారు. తమకు రావాల్సిన రూ.1500 కోట్ల బకాయిలకు ఇప్పటివరకు రూ.50 కోట్లు మాత్రమే చెల్లించినట్లుగా చెబుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే తాము ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా వెల్లడించారు. ఆరోగ్యశ్రీ కింద అందిస్తున్న చికిత్సలకు ఇచ్చే ప్యాకేజీ రేట్లను కూడా పెంచాలని కోరుతున్నాయి. సుమారుగా పదేళ్ల కిందటి ధరలనే ఇప్పటికీ అమలు చేస్తున్నారని తెలిపారు . ప్యాకేజీ ధరల్ని పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.చూడాలి మరి ఇప్పుడు ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకుంటుందో .