EX CM Jagan Tweet on EVMS: ఈవీఎంలపై ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన ట్వీట్ చేశారు. ఎన్నికల్లో ఈవీఎంలకు బదులు పేపర్ బ్యాలెట్లు వాడాలన్ ఎక్స్ లో తెలిపారు. అభివృద్ధి చెందిన దేశాల్లో పేపర్ బ్యాలెట్లే వాడుతున్నారు తప్ప ఈవీఎంలు కాదన్నారు. ఎన్నికల్లో న్యాయం జరగడం మాత్రమే కాదు..అందజేయబడినట్లు కూడా కన్పించాలన్నారు. మన ప్రజా స్వామ్యం యొక్క నిజమైన స్పూర్తిని నిలబెట్టుకోవడంలో మనం కూడా అదే దిశగా పయనించాలని ఎక్స్ వేదికగా కీలక కామెంట్స్ చేశారు.
టీడీపీ కౌంటర్..(EX CM Jagan Tweet on EVMS)
ఇలా ఉండగా జగన్ ట్వీట్ కు టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి కౌంటర్ ఇచ్చారు.జగన్ ఇంకా షాక్ నుంచి తేరుకోలేదని… ఏపీ ఎలన్ మస్క్ లా జగన్ మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ఈవీఎంలు వద్దూ…బ్యాలెట్ పేపర్లు పెట్డండి అంటూ జగన్ చేసిన పోస్ట్ కు కౌంటర్ ఇచ్చారు టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి. గెలిస్తే తన గొప్ప.. ఓడితే ఈవీఎంల తప్పా..? అంటూ ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో తాను గెలిచినప్పుడు ఈవీఎంల గురించి తానేం మాట్లాడాడో జగన్ ఓసారి గుర్తు చేసుకోవాలన్నారు సోమిరెడ్డి. పరనింద.. ఆత్మ స్తుతి మాని ఇకనైనా జగన్ ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి.