Site icon Prime9

Delimitation: ఢీలిమిటేషన్‌పై ప్రధానికి వైసీపీ అధినేత జగన్ సంచలన లేఖ

AP Ex CM Jagan Open Letter to PM Modi: ఢీలిమిటేషన్‌ను వ్యతిరేకిస్తూ తమిళనాడులోని చెన్నై నగరంలో అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి దక్షిణాది రాష్ట్రాల సీఎంలు, విపక్ష నేతలు హాజరయ్యారు. ఈ సందర్బంగా తమిళనాడు సీఎం స్టాలిన్ మాట్లాడారు. జనాభా లెక్కల ఆధారంగా చేపట్టే డీలిమిటేషన్ వ్యతిరేకించాలన్నారు. హక్కుల కోసం అంతా ఐకమత్యంగా పోరాడాలని, లేదంటే మన దేశంలో మన రాష్ట్రాలకే అధికారం లేని పరిస్థితి వస్తుందని స్టాలిన్ అన్నారు.

 

వచ్చే ఏడాది జరగనున్న డీలిమిటేషన్ ప్రక్రియలో ఆయా రాష్ట్రాలకు సీట్లు విషయంలో అన్యాయం జరగకుండా చూసుకోవాలని కోరారు. ప్రస్తుతం జనాభా ఆధారంగా డీలిమినేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాల భాగస్వామ్యం తగ్గే అవకాశం ఉంటుందన్నారు. కావున జనాభా ఆధారంగా కాకుండా వేరే పద్ధతిన డీ లిమిటేషన్ నర్వహన జరిగేలా చొరవ తీసుకోవాలన్నారు.

 

డీలిమిటేషన్ విషయంలో ఏ రాష్ట్రానికి నష్టం కలగకుండా ప్రక్రియ నిర్వహించాలని జగన్ లేఖలో పేర్కొన్నారు. అలాగే జనాభా ప్రాతిపదికన లోక్‌సభ, రాజ్యసభలో రాష్ట్రాలకు సీట్లు తగ్గకుండా చూడాలని కోరారు. అందుకే దక్షిణాది రాష్ట్రాల సీట్లు తగ్గింపు లేకుండా డీలిమిటేషన్ చేపట్టేలాని కోరారు. ఏ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా రానున్న నియోజకవర్గాల పునర్విభజన కసరత్తు నిర్వహించాలని కోరుకుంటున్నట్లు ప్రధాని మోదీకి జగన్ లేఖలో కోరారు.

Exit mobile version
Skip to toolbar