Site icon Prime9

AP Assembly: ఎస్సీ వర్గీకరణపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు.. చంద్రబాబు, మందకృష్ణ మాదిగ చొరవతోనే!

AP Deputy CM Pawan Kalyan Powerful Speech on SC Classification Bill in AP Assembly: అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఇవాళ ఎస్పీ వర్గీకరణ బిల్లుపై చర్చ జరిగింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ ఇక్కడి వరకు వచ్చేందుకు మందకృష్ణ మాదిగ, ఏపీ సీఎం చంద్రబాబు ముఖ్య కారణమని వెల్లడించారు. అనంతరం మందకృష్ణ మాదిగతో పాటు చంద్రబాబుకు అభినందనలు తెలిపారు.

 

కాగా, మాదిగ అని చెప్పగలిగే గుండె ధైర్యం కలిగిన వ్యక్తి మందకృష్ణ మాదిగ అన్నారు. మాదిగ కులానికి వన్నె తెచ్చిన ఆయనను అభినందించారు. ఉమ్మడి ఏపీలో ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని మందకృష్ణ మాదిగ ప్రారంభించగా.. చంద్రబాబు ముందుకు తీసుకెళ్లారని అన్నారు.

 

ఇదిలా ఉండగా, ఎస్సీ వర్గీకరణపై ఇప్పటికే ఎన్నో చర్చలు జరిపారని గుర్తు చేశారు. అంతేకాకుండా గత కొంతకాలంగా గుర్తింపు లేని కులాలపై సైతం విస్తృతంగా చర్చలు జరిగినట్లు చెప్పారు. ఈ విషయంలో చాలామంది దళిత మేధావులను కలిసినట్లు పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.

 

ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువగా మాల కులస్తులు ఉంటారని, తెలంగాణలో మాదిగలు ఉంటారన్నారు. అయితే పేరు చివరిన కులాల పేర్లను చేర్చేకోవడం అగ్రవర్ణాల్లోనే కనిపిస్తుందని, కానీ మంద కృష్ణ తన పేరుకు చివర మాదిగ కులం పేరు చేర్చుకోవడం గొప్ప విషయమన్నారు.

 

ఒక్కో రాష్ట్రంలో ఒక్కో కులం ఎక్కువగా ఉంటుందని, ఆయా కులాల జనాభాలో తేడాలు ఉంటాయని తెలిపారు. కేంద్రం దృష్టికి ఎస్సీ వర్గీకరణ బిల్లును తీసుకెళ్లిన ఘనత ఏపీకి దక్కుతుందన్నారు. చంద్రబాబు హయంలో ఎన్డీఏ కూటమి తీసుకొచ్చిన ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లుకు జనసేన మద్దతు తెలపడం అంగీకరిస్తున్నట్లు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

Exit mobile version
Skip to toolbar