CS Jawahar Reddy: ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డిని సెలవుపై వెళ్లాల్సిందిగా చంద్రబాబు ఆదేశించడం జరిగిందని తెలుస్తోంది .ఇక, సాయంత్రంలోగా కొత్త సీఎస్ నియామకానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.1992 బ్యాచ్ కు చెందిన విజయానంద్ ను సీఎస్ గా చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం .
వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారని సీఎస్ జవహర్‌రెడ్డిపై ఆరోపణలు వచ్చాయి.. సీఎస్ జవహర్‌రెడ్డిపై కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదులు కూడా వెళ్లాయి.. ఈ నేపథ్యంలోనే ఆయన్ని పక్కన పెట్టాలని కొత్త ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబును నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు సీఎస్ జవహర్‌రెడ్డి.. కొన్ని అంశాలపై చర్చించే ప్రయత్నాలు చేసినా.. తర్వాత చూద్దామంటూ చంద్రబాబు దాటవేసినట్టుగా ప్రచారం .ఇదిలా ఉండగా ఈనెలాఖరుకు సీఎస్ జవహర్‌రెడ్డి పదవి విరమణ చేయనున్నారు .అప్పటి వరుకు అయన సెలవులోనే ఉండనున్నారు .ఇప్పటి వరుకు సీఎస్ జారీచేసిన ఉత్తర్వులను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది . ఎన్నికలకు ముందు మొత్తంగా 1,800 మంది టీచర్ల బదిలీలు జరిగాయి. మొత్తంగా బదిలీలనే నిలిపివేయాలనే నిర్ణయానికి వచ్చింది విద్యాశాఖ. ఇలా అన్ని విషయాలపై ఫోకస్ పెట్టింది కొత్త ప్రభుత్వం..