AP Cabinet: ఏపీలో ఇప్పుడు ఎవరు మంత్రివర్గంలో స్థానం దక్కించుకుంటారనే చర్చ బాగా జరుగుతోంది . 164 స్థానాలు గెలుచుకుని భారీ మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి. మొత్తం 26 మంత్రి పదవులు ఉంటాయి .వాటిలో ముఖ్యమంత్రి ని మినహా ఇస్తే 25 గురుకే మంత్రి పదవులు దక్కే ఛాన్స్ వుంది .వీటిలో రెండో మూడో జనసేనకు ఇవ్వాల్సిందే .బీజేపీకి కుడి రెండు ఇవ్వాల్సి వస్తుంది .మిగిలిన 20 మంది టీడీపీ తరుపున ఎంపిక చేయాల్సి ఉంటుంది .మొత్తం టీడీపీ కి 135 ఎమ్మెల్యే లు వున్నారు .వాళ్ళనుంచి 20 మందిని ఎంపిక చేయడం కత్తి మీద సామే అవుతుంది . ఇప్పటికే లాబీయింగ్‌లు కూబా మొదలు పెట్టేసినట్టు సమాచారం. దింతో మంత్రి పదవులు ఎవరికి దక్కబోతున్నాయి. చంద్రబాబు.. తన కేబినెట్‌లో ఎవరెవరికి చోటు ఇవ్వబోతున్నారు. ఇప్పుడు ఇదే ఆసక్తికరంగా మారింది.
టీడీపీ సీనియర్లకు… సామాజిక సమీకరణాల ఆధారంగా మంత్రి పదువులు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈ లిస్ట్‌లో.. చంద్రబాబు తనయడు నారా లోకేష్‌తో పాటు టీడీపీ సీనియర్ నేతలు అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు, చింతకాయ అయ్యన్నపాత్రుడు, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, ధూళిపాళ్ల నరేంద్ర వంటి నేతలు ఉన్నట్టు తెలుస్తోంది.
శ్రీకాకుళం జిల్లా నుంచి కింజారపు అచ్చెన్నాయుడు, కూన రవికుమార్, బెందాళం అశోక్ మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. విజయనగరం జిల్లా నుంచి కళా వెంకట్రావు, అదితి గజపతిరాజు ,బేబినాయన రేసులో వునంట్లు తెలుస్తోంది .ఇక విశాఖ జిల్లా నుంచి మంత్రి పదవులు ఆశిస్తున్న వారి జాబితా చాంతాడంత ఉంది. విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి నాలుగోసారి గెలిచిన వెలగపూడి రామకృష్ణబాబు, నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిచిన గంటా శ్రీనివాసరావు, నర్సీపట్నం నుంచి ఏడోసారి గెలిచిన అయ్యన్నపాత్రుడు, గాజువాక నుంచి టీడీపీ తరపున రెండోసారి గెలిచిన పల్లా శ్రీనివాసరావు, పాయకరావుపేట నుంచి రెండోసారి విజయం సాధించిన వంగలపూడి అనిత, మాడుగుల నుంచి గెలిచిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి మంత్రి పదవులు తమకే వస్తాయని గట్టిగా నమ్మకం పెట్టుకున్నారు.
తూర్పుగోదావరి జిల్లా నుంచి జ్యోతుల నెహ్రూ, నిమ్మకాయల చినరాజప్ప, గోరంట్ల బుచ్చయ్యచౌదరి పోటీలో వున్నారు .సామజిక సమీకరణాల ఆధారంగా జ్యోతుల నెహ్రు ,చినరాజప్ప లలో ఒకరికి మంత్రి పదవి దక్కే అవకాశం వుంది.జ్యోతుల నెహ్రు సీనియర్ నాయకుడు .చినరాజప్ప ఒక సారి మంత్రి పదవి నిర్వహించారు కాబట్టి ఈసారి నెహ్రు కు అవకాశం ఉందని తెలుస్తోంది . పశ్చిమగోదావరి జిల్లా నుంచి నిమ్మల రామానాయుడు, చింతమనేని ప్రభాకర్, పితాని సత్యనారాయణ, రఘురామకృష్ణంరాజు పోటీలో వున్నారు . కృష్ణా జిల్లా నుంచి కొల్లు రవీంద్ర, బోండా ఉమా, గద్దె రామ్మోహన్, వసంత కృష్ణప్రసాద్, కేపీ సారథి ఈవీరికి వారే లాబీయింగ్ చేసుకుంటున్నారు .
గుంటూరు జిల్లా నుంచి నారా లోకేష్, ధూళిపాళ్ల నరేంద్ర, ప్రత్తిపాటి పుల్లారావు, కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనంద్‌బాబు ,యరపతినేని శ్రీనివాసరావు లు పోటీ పడుతున్నారు . ప్రకాశం జిల్లా నుంచి దామరచర్ల జనార్దన్, గొట్టిపాటి రవికుమార్ ,డోలా బాల వీరాంజనేయులు రేసులో వున్నారు . నెల్లూరు జిల్లాలో కూడా పోటీ ఎక్కువగా వుంది . పి.నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ,ఆనం రామనారాయణ రెడ్డి రంగంలో వున్నారు . కర్నూలు జిల్లా నుంచి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, భూమా అఖిలప్రియ, ఎన్‌ఎండీ ఫరూఖ్ ,గౌరు చరిత రెడ్డి మంత్రి పదవిపై
ఆశలు పెట్టుకున్నారు .చిత్తూరు జిల్లా నుంచి పులివర్తి నాని, అమర్‌నాథ్‌రెడ్డి, బొజ్జల సుధీర్ రెడ్డి మంత్రి పదవులను ఆశిస్తున్నారు . నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కూడా రేసులో వున్నారు .సోదరుడు కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీగా ఓడిపోవడం తో కిషోర్ కుమార్ రెడ్డి కోసం లాబీయింగ్ చేసే అవకాశం వుంది .ఇక కడప జిల్లా నుంచి రెడ్డప్పగారి మాధవి, వరదరాజులరెడ్డి ,పుత్తా సుధాకర్ యాదవ్ మంత్రి పదవులు ఆశిస్తున్నారు. అనంతపురం జిల్లా నుంచి పయ్యావుల కేశవ్, పరిటాల సునీత, కాల్వ శ్రీనివాసులు,బాలకృష్ణ మంత్రి పదవి రేసులో వున్నారు .