Site icon Prime9

AP Assembly Session: ఈ నెల 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

AP Assembly Session

AP Assembly Session

AP Assembly Session:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సమావేశాలు ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్నాయి. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి అసెంబ్లీ సమావేశం కానుంది. జూన్ 21 నుంచి రెండు రోజులపాటు సమావేశాలు జరగనున్నాయి. వాస్తవానికి జూన్ 19 నుంచి సమావేశాలు జరగాల్సి ఉండగా.. గవర్నర్ అబ్దుల్ నజీర్ బక్రీద్ సందర్భంగా సెలవులపై ఉండటంతో అసెంబ్లీ సమావేశాల తేదీల్లో మార్పు చోటు చేసుకుంది.

కీలకబిల్లుల ఆమోదం.. (AP Assembly Session)

కాగా, జూన్ 21న ప్రొటెం స్పీకర్‌ను ఎన్నుకున్న తర్వాత నూతనంగా ఎన్నికైన శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం జరగనుంది. రెండో రోజు శాసన సభాపతి ఎన్నిక జరుగనుంది.జూన్ నెలాఖరకు ముగియనున్న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్.సభ్యుల ప్రమాణ స్వీకారాలన్నీ పూర్తయ్యాకే పూర్తి స్థాయి బడ్జెట్ తో పాటు… కీలక బిల్లులను శాసనసభ ఆమోదించే అవకాశం ఉంది.రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశంలో కొత్త ఎమ్మెల్యేలు శాసన సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం అసెంబ్లీ స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ను ఎన్నుకుంటారు. టీడీపీ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడు స్పీకర్‌ అవుతారని ప్రచారం జరుగుతోంది. డిప్యూటీ స్పీకర్‌పై ఇంకా క్లారిటీ లేదు. ప్రొటెం స్పీకర్‌గా సీనియర్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహరించనున్నారు.

Exit mobile version