Site icon Prime9

AP Assembly: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. ప్రభుత్వ స్కూళ్లపై నారా లోకేశ్ కీలక ప్రకటన

AP Assembly Budget Sessions: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు తొమ్మిదో రోజు కొనసాగుతున్నాయి. ఇవాళ సభలో ప్రశ్నోత్తరాల తర్వాత పలు అంశాలపై చర్చ మొదలైంది. ఇందులో భాగంగానే గ్రాంట్లు, డిమాండ్లపై చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగానే రాజధాని భూసేకరణ అంశంపై మంత్రి నారాయణ మాట్లాడారు. 2015 జనవరి 1న భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చామని, 2015 ఫిబ్రవరి 15లోగా భూసేకరణ చేసినట్లు తెలిపారు. ఒక్క సమస్య కూడా లేకుండా 58 రోజుల్లోనే భూసేకరణ చేశామన్నారు. సీఎం చంద్రబాబుపై విశ్వాసంతో రైతులు 34 వేల ఎకరాలు ఇచ్చారని మంత్రి నారాయణ గుర్తు చేశారు.

 

అయితే రాజధానిపై కక్షతోనే అమరావతిలో మాజీ సీఎం జగన్ ఆర్5 జోన్ క్రియేట్ చేశారని మంత్రి నారాయణ ఆరోపించారు. ఆ ప్రాంతంలో సెంటు చొప్పున 50వేల మందికి ఇచ్చిన స్థలాన్ని వెనక్కి తీసుకొని వారికి వేరేచోట స్థలాలు ఇస్తామని చెప్పారు. ప్రతిపక్షంలో రాజధానికి 30వేల ఎకరాలు కావాలన్న జగన్ అధికారంలోకి వచ్చి మూడు ముక్కలాట ఆడారని విమర్శలు చేశారు. ఆనాడు 3 ఏళ్లలో రాజధానిని నిర్మిస్తామని, 185 అడుగుల వెడల్పు రోడ్లు 2 ఏళ్లలో పూర్తవుతాయన్నారు.

 

అనంతరం మంత్రి నారా లోకేశ్ మాట్లాడారు. రాష్ట్రంలో కొన్ని ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతులు బాగున్నాయని, మరికొన్ిన చోట్ల పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని మంత్రి అన్నారు. స్కూళ్లకు రేటింగ్ ఇస్తున్నామని, ప్రభుత్వ బడులను 5 స్టార్ రేటింగ్‌లోకి తేవాలంటే రూ.13,526 కోట్లు కావాలన్నారు. ప్రజాప్రతినిధులు స్కూళ్లను దత్తత తీసుకోవాలన్నారు. నాడు-నేడు పనులు చాలా చోట్ల పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని పూర్తి చేయడానికి రూ.4,789 కోట్లు అవసరమవుతాయని తెలిపారు.

Exit mobile version
Skip to toolbar