Site icon Prime9

Harirama Jogaiah: మరో సంచలన లేఖ విడుదల చేసిన హరిరామ జోగయ్య

Jogaiah

Jogaiah

 Harirama Jogaiah: కాపు సంక్షేమసేన అధ్యక్షులు చేగొండ హరిరామ జోగయ్య లేఖ విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ మంత్రివర్గంలో ఉంటూ అధికారంలో భాగస్వామి అయితే రెండో పవర్ సెంటర్ అయ్యేది మాత్రం నిజమన్నారు. జనసేనపార్టీ తరపున ముగ్గురు లేక నలుగురుకు స్థానం దక్కవచ్చని కొన్ని మీడియా సంస్థలు తమ ఊహగానాలను ప్రకటిస్తున్న నేపథ్యంలో జోగయ్య ఈ లేఖ విడుదల చేయడం గమనార్హం.

పవన్ కళ్యాణ్ తీసుకొనే నిర్ణయంపైనే ..(Harirama Jogaiah)

పవన్ కళ్యాణ్ మంత్రివర్గంలో ఉంటూ అధికారంలో భాగస్వామి అయితే రెండవ పవర్ సెంటర్ అయ్యేది మాత్రం నిజం. దీనిని చంద్రబాబు యిష్టపడతాడా అంటూ జోగయ్య ప్రశ్నించారు . ఒక వేళా ఇష్టపడకపోతే పవన్ కళ్యాణ్ ను మంత్రివర్గంలో కి తీసుకోకుండా కేంద్ర రాజకీయాలకు పరిమితం చేయటానికి గాని ఏమైనా చర్యలు చేబడుతున్నారా? దీని వెనుక మీడియా కుట్ర ఏదైనా దాగి వుందా? అంటూ జోగయ్య ప్రశ్నలు లేవనెత్తారు .ఈ క్రమంలో అధికారంలో భాగస్వామి అవడం ద్వారా రాష్ట్ర రాజకీయాలలో క్రియాశీలంగా ఉండాలా, లేక కేంద్ర రాజకీయాలకు పరిమితిమవ్వాలా లేక సినిమాలు తీసుకోవాలో అనేది పవన్ కళ్యాణ్ తీసుకొనే నిర్ణయంపైనే ఆధారపడి ఉందని అన్నారు .

మంత్రిగా పవన్ కళ్యాణ్ | Harirama Jogaiah Letter | Pawan Kalyan | Prime9

 

Exit mobile version
Skip to toolbar