Kamareddy : తెలంగాణలో కేసీఆర్ కిట్ పేరిట బాలింతలకు ఉపయోగపడే వస్తువలను ఉచితంగా అందిస్తున్న కేసీఆర్ సర్కార్ పౌష్టికాహార లోపాలను నివారించేందుకు కేసీఆర్ పోషకాహర కిట్ ను అందించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 9 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ఈ న్యూట్రిషన్ కిట్ పంపిణీని బుధవారం వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కామారెడ్డి కలెక్టరేట్ నుండి ప్రారంభించారు. ఇక్కడినుండే మిగతా ఎనిమిది జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని వర్చువల్ మోడ్ లో హరీష్ రావు ప్రారంభించారు.
ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ గర్భిణులు రక్తహీనతతో బాధపడకూడదనే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పంపిణీ చేస్తున్నామన్నారు. గర్భిణులకు పౌష్టికాహారం ఇవ్వాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని అన్నారు. ఈ కిట్‌ను కాబోయే తల్లులు మాత్రమే వినియోగించాలని సూచించారు.ప్రాథమికంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భద్రాద్రి, ములుగు, భూపాలపల్లి, వికారాబాద్, నాగర్ కర్నూల్, గద్వాల, కొత్తగూడెం జిల్లాల్లో ముందుగా కిట్లు పంపిణీ చేయనున్నారు. ఆయా కార్యక్రమాల్లో గర్భిణుల్లో రక్తహీనత, పోషకాహార లోపాన్ని నివారించడంతో పాటు మాతా, శిశు మరణాల నివారణ కోసం ప్రభుత్వం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను ప్రవేశపెట్టింది.
ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలతో కూడిన న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేయనున్నది. 16 నుంచి 24వారాలు ( రెండో త్రైమాసికం), 27 నుంచి 24 వారాలు (మూడో త్రైమాసికం) ఉన్న గర్భిణులు ఈ కిట్‌కు అర్హులని అధికారులు పేర్కొన్నారు. న్యూట్రిషన్ కిట్ల కోసం రూ.50కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. ఒక్కో కిట్ రూ.2 వేల వరకు ఉంటుంది. ఈ కిట్ లో ఆరకిలో నెయ్యి, కిలో ఖర్జూర పండ్లు ఒక్కొక్కటి కిలో చొప్పున రెండు హార్లిక్స్ బాటిల్స్, ఇతర పోషక పదార్థాలు ఉంటాయి.