Site icon Prime9

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబుపై మరో కేసు నమోదు.

Chandrababu

Chandrababu

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబుపై మరో కేసు నమోదయింది. మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్న ఆరోపణలతో చంద్రబాబుపై సీఐడీ కేసు నమోదు చేసింది. పీసీ యాక్ట్ కింద చంద్రబాబుపై కేసు నమోదు చేశారు.

ఏ3గా చంద్రబాబు పేరు..(Chandrababu)

ఈ కేసులో ఏ1 గా నరేష్ , ఏ2గా కొల్లు రవీంద్ర, ఏ3గా చంద్రబాబు పేర్లను సీఐడీ అధికారులు చేర్చారు. ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను ఏసీబీ కోర్టు అనుమతించింది. ఇప్పటికే ఏపీ ఫైబర్ నెట్ కేసు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, అంగళ్లు కేసుల్లో చంద్రబాబు పేరును చేర్చిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 9న ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసారు.

మరోవైపు ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. దీంతో కోర్టు తీర్పుని రిజర్వ్ చేసింది. రేపు తీర్పు వెల్లడిస్తామని హైకోర్టు వెల్లడించింది. ఏసీబీ కోర్టులో బెయిల్ రాకపోవడంతో.. చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. కంటి ఆపరేషన్ కోసం మధ్యంతర బెయిల్ అయినా మంజూరు చేయాలని పిటీషన్ లో కోరారు. ఇక హైకోర్టులో సుప్రీమ్ కోర్టు న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా వర్చువల్ గా వాదనలు వినిపించారు. మెయిన్ బెయిల్ పిటిషన్‌పై ఎప్పుడు వాదనలు వింటామన్నది రేపు హైకోర్టు నిర్ణయించనుంది.

 

Exit mobile version