Site icon Prime9

AP Government: ఏపీలో నేటి నుంచి వైఎస్‌ఆర్‌ కళ్యాణమస్తు’, ‘షాదీ తోఫా’ పథకాలు

ap-govt-schemes

Andhra Pradesh: ఏపీలో ‘ నేటినుంచి వైఎస్‌ఆర్‌ కళ్యాణమస్తు’, ‘షాదీ తోఫా’ పథకాలు అమల్లోకి రానున్నాయి. వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ తోఫా పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. బాల్యవివాహాలను నివారించడం డ్రాపౌట్ రేట్‌ను గణనీయంగా తగ్గించడం లక్ష్యాలుగా వైఎస్సార్ షాదీ తోఫా పథకాలకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గత ప్రభుత్వంతో పోలీస్తే అర్హులకు భారీగా ఆర్ధిక సహాయం పెంచామనీ సీఎం జగన్ తెలిపారు.పేద ఆడపిల్ల కుటుంబాలకు బాసటగా ఉండేందుకు, గౌరవప్రదంగా వివాహం జరిపించేందుకు తోడ్పాటుగా ఈ పథకాన్ని జగన్‌ సర్కార్‌ అమలు చేయనుంది.

కళ్యాణమస్తు, షాదీ తోఫాల కింద గత ప్రభుత్వం ప్రకటించిన దానికంటే అధికంగా నగదు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. కులాంతర వివాహం చేసుకున్న వారికి లక్షా 20 వేల రూపాయలు కానుకగా ఇవ్వనున్నారు. దివ్యాంగులకు ఈ పథకం కింద రూ.1.5 లక్షలు ప్రోత్సాహకంగా అందించనున్నారు. అయితే, ఈ పథకం కింద నగదు ప్రోత్సాహకం పొందేందుకు వధూవరులు తప్పనిసరిగా టెన్త్ పాసై ఉండాలి. అమ్మాయి వయసు 18 ఏళ్లు నిండాలి. అబ్బాయికి 21 ఏళ్లు నిండాలి. గ్రామాల్లో ఆదాయం నెలకు 10 వేలు పట్టణాల్లో అయితే నెలకు 12 వేలకు మించకూడదు. వారి ఇళ్ళలో నెలవారి విద్యుత్ వాడకం 300 యూనిట్లు దాటకూడదు.

అలాగే కుటుంబంలో ఇన్ కమ్ టాక్స్ పేయర్లు, ప్రభుత్వ ఉద్యోగులు ఉండకూడదు. బాల్య వివాహాల నివారణ, చదువులను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ నిబంధన తీసుకొచ్చినట్లు సీఎం జగన్ అన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ పథకాలకు సంబంధించిన దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అవసరమైతే వాలంటీర్ల సాయం తీసుకోవచ్చునని వెల్లడించారు. ఎవైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ తోఫా పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. బాల్యవివాహాలను నివారించడం డ్రాపౌట్ రేట్‌ను గణనీయంగా తగ్గించడం లక్ష్యాలుగా వైఎస్సార్ షాదీ తోఫా పథకాలకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గత ప్రభుత్వంతో పోలీస్తే అర్హులకు భారీగా ఆర్ధిక సహాయం పెంచామని సీఎం జగన్ తెలిపారు.

Exit mobile version