YSR Vardhanthi: నేడు వైయస్ ఆర్ వర్ధంతి

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు వైఎస్సార్‌ జిల్లాలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్థంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద ఆయనకు ఘన నివాళులర్పించారు.

  • Written By:
  • Updated On - September 2, 2022 / 10:46 AM IST

Andhra Pradesh: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు వైఎస్సార్‌ జిల్లాలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్థంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద ఆయనకు ఘన నివాళులర్పించారు. జగన్ తో పాటు ఆయన తల్లి వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ భారతి, చెల్లి వైఎస్‌ షర్మిల వైఎస్సార్‌కు ఘాట్ వద్దకు అందరూ కలిసి వచ్చి నివాళులర్పించారు. ఆ తరువాత అందరూ కలిసి వై యస్ రాజశేఖర్ రెడ్డికి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

వై యస్ జగన్ తన తండ్రి గారిని తలుచుకుంటూ ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన ట్విట్టర్ నందు ఒక ట్వీట్ చేశారు.”నాన్న భౌతికంగా మాకు దూరమైన నేటికీ ఆయన చిరునవ్వు, అన్ని జ్ఞాపకాలు మాతోనే ఎప్పటికి నిలిచి ఉంటాయని అన్నారు. దేశచరిత్రలోనే సంక్షేమాన్ని కొత్త బాటలో చూపించి ప్రజల అవసరాలే పాలనకు ముఖ్యమైన అంశం అని ఆయన చాటిచెప్పారు. నేను వేసే ప్రతి అడుగులోనూ మా నాన్నే స్ఫూర్తి ఉంటుందని, అలాగే ముందు ముందు కూడా మా ప్రభుత్వం ఇలాగే అడుగులు వేస్తుందని ” అని సీఎం జగన్‌ తన ట్విట్టర్ ద్వారా ట్వీట్‌ చేసి వెల్లడించారు.