Site icon Prime9

YS Bhaskar Reddy: వైఎస్ భాస్కర్ రెడ్డికి మరోసారి అస్వస్థత.. నిమ్స్ కి తరలింపు

bhaskar reddy

bhaskar reddy

YS Bhaskar Reddy: వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ భాస్కర్ రెడ్డి మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో చంచల్ గూడ జైలు అధికారులు.. నిమ్స్ కి తరలించారు. ప్రస్తుతం ఈయన చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈక్రమంలో అస్వస్థతకు గురి కావటంతో జైలు సిబ్బంది డాక్టర్ల సూచననలతో ఆయన్ని నగరంలోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు.

మరోసారి అస్వస్థత..

వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ భాస్కర్ రెడ్డి మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో చంచల్ గూడ జైలు అధికారులు.. నిమ్స్ కి తరలించారు. ప్రస్తుతం ఈయన చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈక్రమంలో అస్వస్థతకు గురి కావటంతో జైలు సిబ్బంది డాక్టర్ల సూచననలతో ఆయన్ని నగరంలోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు.

శుక్రవారం ఉదయం భాస్కర్‌రెడ్డికి బీపీ పెరగడంతో మెుదట గాంధీ ఆస్పత్రికి తరలించి.. వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం తిరిగి చంచల్‌గూడ జైలుకు తీసుకొచ్చారు. అయినా ఆయన ఆరోగ్యపరిస్థితి మెరుగుపడకపోవడంతో మరోసారి శనివారం ఉదయం నిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు.

కాగా వివేకా కేసులో తండ్రీ కొడుకులు ఇద్దరు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈక్రమంలో అనూహ్యంగా భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా కోర్టు రిమాండ్ విధించింది. దీంతో ఆయన అప్పటినుంచి చంచల్ గూడ జైలులోనే ఉంటున్నారు. మరోపక్క అవినాశ్ రెడ్డిని పలుమార్లు విచారించిన సీబీఐ అరెస్ట్ చేయటానికి సిద్ధంగా ఉంది.

కాగా..సీబీఐ విచారణకు వచ్చిన సమయంలోనే అవినాశ్ తల్లి..భాస్కర్ రెడ్డి భార్య అస్వస్థతకు గురికావటంతో నిన్నటి వరకు కర్నూలు విశ్వభారతి ఆస్పత్రిలో చికిత్స అందించగా ఆమె ఆరోగ్యం కాస్త కుదుటపడింది. దీంతో మెరుగైన చికిత్స్ కోసం హైదరాబాద్ తరలించారు. ఈక్రమంలో భాస్కర్ రెడ్డి అస్వస్థతకు గురి కావటం నిమ్స్ ఆస్పత్రికి తరలించటం జరిగింది.

Exit mobile version