Site icon Prime9

Mla Kannababu Raju: కన్నబాబు వద్దు.. జగనన్న ముద్దు.. యలమంచిలి ఎమ్మెల్యేకు వైసీపీ సర్పంచ్ షాక్

Kannababu Raju

Kannababu Raju

Andhra Pradesh: అనకాపల్లి జిల్లా యలమంచిలి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కన్నబాబు రాజుకు చేదు అనుభవం ఎదురైంది. అచ్యుతాపురం మండలం దొప్పెర్ల పంచాయతీలో జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ సర్పంచ్ కె. చిన్నారావు ఎమ్మెల్యే పై నిరసనకు దిగారు. ప్రతి ఇంటి వద్ద కన్నబాబురాజుకు వ్యతిరేకంగా బోర్డులు పెట్టారు. కన్నబాబురాజు తీరుకు నిరసనగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. తప్పు చేయనని గొప్పగా చెప్పి, తప్పు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్వర్షన్ అయిన భూమిని అమ్ముకుంటూ రైతులకు, ప్రజలకు అన్యాయం చేశారని మండిపడ్డారు.

ప్రభుత్వ పథకాల అమలు విషయంలో వివక్ష చూపిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నబాబు వద్దు, జగనన్న ముద్దు అంటూ నినాదాలు చేశారు. కన్నబాబు అరాచకాలు జగన్ వరకూ చేరాలని, కన్నబాబు అరాచకాలు నశించాలి అంటూ ప్లకార్డులతో ధర్నా చేశారు. ఎమ్మెల్యేను స్థానికులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం కనిపించింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి సర్థిచెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది.

Exit mobile version