Perni Nani : బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఈ మేరకు ఆదివారం ( జూన్ 11, 2023 ) తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా పేరణి నాని మాట్లాడుతూ.. ‘మీ హయాంలో ఇసుక ఫ్రీ అని నదుల్లో ఉన్న ఇసుకను టీడీపీ, బీజేపీ దోచుకుంది అని నడ్డాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వైసీపీ హయాంలో నాలుగేళ్లలో 4 వేల కోట్లు ప్రభుత్వానికి అదాయం వచ్చిందని తెలిపారు. నాలుగు వేల కోట్ల రూపాయలు టీడీపీ, బీజేపీ హయాంలో ఎవరి జేబుల్లోకి వెళ్లిందో నడ్డాకే తెలియాలన్నారు. కాగా నిన్న బీజేపీ నిర్వహించిన సభలో నడ్డా ఏపీ సర్కారుని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అందుకే ఇప్పుడు పేరణి కౌంటర్ ఇచ్చారని అంతా భావిస్తున్నారు.
Perni Nani : జేపీ నడ్డాకి కౌంటర్ ఇచ్చిన మాజీ మంత్రి పేర్ని నాని.. ఆ నెలుగు వేల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లిందో అంటూ !

ycp mla perni nani counter to bjp chief jp nadda