Yarlagadda Lakshmi Prasad: సీఎం జగన్ నా దృష్టిలో హీరోనే.. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన దృష్టిలో హీరో అని యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ అన్నారు. జగన్ ను సోనియా కేంద్రమంత్రిని చేస్తానని చెప్పినప్పటికీ, ఏం అవసరం లేదంటూ ఓదార్పు యాత్రకు వెళ్లిపోయిన వ్యక్తి జగన్ అని తెలిపారు.

  • Written By:
  • Publish Date - September 27, 2022 / 06:10 PM IST

Andhra Pradesh: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన దృష్టిలో హీరో అని యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ అన్నారు. జగన్ ను సోనియా కేంద్రమంత్రిని చేస్తానని చెప్పినప్పటికీ, ఏం అవసరం లేదంటూ ఓదార్పు యాత్రకు వెళ్లిపోయిన వ్యక్తి జగన్ అని తెలిపారు. ఆ తర్వాత పిచ్చి కేసులో 16 నెలల పాటు జైల్లో ఉన్నాడు. ఆ తర్వాత 3,850 కిలోమీటర్ల పాదయాత్ర చేసి 151 ఎమ్మెల్యేలను, 23 మంది ఎంపీలను గెలిపించుకున్నాడు. ఇది హీరోయిజం కాదా అని ఆయన అన్నారు.

నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ 151 సీట్లు సాధించిన జగన్ ను నేను ఎందుకు తిట్టాలి. జగన్ ను తిట్టి వేరే పార్టీ వాళ్లను పొగడాలా, ఆయన సీఎం అయ్యాక నన్ను గౌరవించారు. అడగకుండానే చైర్మన్ ను చేశారు. జగన్ కచ్చితంగా హీరోనే. ఆనాడు ఎన్టీఆర్ కు భారతరత్న రాకుండా అడ్డుకున్నది చంద్రబాబే, అందుకు నేను ప్రత్యక్ష సాక్షిని, బాబు హయాంలో గన్నవరం ఎయిర్ పోర్లుకు ఎన్టీఆర్ పేరెందుకు పెట్టలేదు అని యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ప్రశ్నించారు. దివంగత రాజశేఖర్ రెడ్డి సంస్కారవంతుడు కాబట్టే తెలుగు గంగ ప్రాజెక్టుకు ఎన్టీఆర్ పేరు పెట్టారని తెలిపారు.

నా రాజీనామా విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. నేను స్వరం మార్చలేదు. నాపై విమర్శలు చేసేవారికి ఫోన్ల ద్వారా వివరణ ఇస్తున్నా. యూనివర్సిటీ పేరు మార్పు పై లక్ష్మీ పార్వతి వ్యాఖ్యలు తన సొంత అభిప్రాయం’ అని యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ పేర్కొన్నారు. తానేమీ స్వరం మార్చలేదని యార్లగడ్డ స్పష్టం చేశారు. రాజీనామా పై మరోమాటకు తావులేదని, తాను పదవిలో లేనప్పటికీ తెలుగు భాష ఉన్నతికి కృషి చేస్తానని తెలిపారు. ఒక భాషా ప్రచార అభిమానిగా అంతకుముందు పదిహేనేళ్లుగా ఏం చేశానో, ఇకపైనా అదే చేస్తానని అన్నారు. రాజకీయాలు మాట్లాడబోనని తేల్చి చెప్పారు.