Prime9

Andhra Pradesh: సీఎం జగన్ నివాసం వద్ద చేయి కోసుకున్న మహిళ

Andhra Pradesh: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసం వద్ద ఓ మహిళ చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కాకినాడ జిల్లాకు చెందిన తల్లీ, కూతుళ్లు సాయం కోసం బుధవారం సీఎం నివాసానికి వచ్చారు. అయితే తక్షణ సాయం పై స్పష్టమైన హామీ అందకపోవడంతో తల్లి ఆరుద్ర చేయి కోసుకుంది.

కాకినాడ గ్రామీణ మండలం రాయుడుపాలెంకి చెందిన ఆరుద్ర కి లక్ష్మీ చంద్ర అనే కూతురు ఉంది. ఆమె పుట్టుకతోనే వెన్నెముక సమస్యతో బాధపడుతుంది. ఆమె చికిత్స కు రెండు కోట్లు కావాలని వైద్యులు చెప్పడంతో కూతురి వైద్యం కోసం అన్నవరంలో ఉన్న ఇంటిని అమ్మేందుకు ఆరుద్ర ప్రయత్నించింది. అయితే ఆమె ఆమె ఇంటిని అమ్మనివ్వకుండా మంత్రి దాడిశెట్టి రాజా గన్ మెన్, మరో కానిస్టేబుల్ తో కలిసి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆరుద్ర ఆరోపిస్తోంది.

తన కుమార్తెను కాపాడాలని సీఎం జగన్ ని వేడుకునేందుకు ఆమె సీఎం కార్యాలయం వద్దకు వచ్చింది. అయితే సీఎం అపాయింట్మెంట్ లభించలేదు. స్పందనలో ఫిర్యాదు చేసి తిరిగి వెళుతూ బ్లేడ్‌తో చేయికోసుకుంది. వెంటనే అప్రమత్తమైన క్యాంపు కార్యాలయం భద్రతా సిబ్బంది మహిళను ఆసుపత్రికి తరలించారు.

Exit mobile version
Skip to toolbar