Site icon Prime9

Volunteer : ఏలూరు జిల్లాలో వాలంటీర్ ఘరానా మోసం.. మహిళ వేలి ముద్రలతో డబ్బు కాజేసిన వైనం

volunteer withdrawn 2 lakhs rupees using women finger prints in eluru district

volunteer withdrawn 2 lakhs rupees using women finger prints in eluru district

Volunteer : ఏపీలో వాలంటీర్ల వ్యవహారం ఎంతటి చర్చనీయాంశంగా మారిందో ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ఒక వైపు కొందరు వాలంటీర్ల నేరాలు, డేటా సేకరణ వంటి అంశాలు ఏపీలో కలకలం సృష్టిస్తుంటే.. మరోవైపు వాలంటీర్ల నేరాలు ఒక్కోటిగా బయటపడడం ప్రభుత్వానికి మింగుడు పడని అంశంలా తయారయ్యింది. కాగా ఇప్పటికే బంగారం కోసం ఓ వాలంటీర్ మహిళను దారుణంగా హతమార్చిన ఘటన, ఆసరా పెన్షన్ డబ్బులతో వాలంటీర్ జూదం ఆడి.. డబ్బులన్నీ పోగొట్టుకున్న విషయాలు వెలుగులోకి వచ్చి సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

అయితే ఇప్పుడు తాజాగా ఏలూరు జిల్లాలో వాలంటీర్ ఘరానా మోసం బయటపడింది. ఓ మహిళ బ్యాంకు అకౌంట్ నుంచి.. తనకే తెలియకుండా..తన వెలి ముద్రల సాయంతో లక్షల్లో డబ్బులు కాజేసిన ఘటన హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటనలో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

కొయ్యలగూడెంకు చెందిన కొట్రా నాగమణి ఇటీవల బ్యాంకుకు వెళ్లి తన అకౌంట్‌లో రూ.13,500 జమ చేసింది. కాగా అకౌంట్‌లో మొత్తం ఎంత డబ్బు ఉందని బ్యాంకు సిబ్బందిని ఆరా తీయగా..  ఇప్పుడు జమ చేసిన రూ.13,500 మాత్రమే ఉందని చెప్పడంతో ఆమె అవాక్కయ్యింది. దాంతో తన అకౌంట్ నుంచి తాను ఎప్పుడూ డబ్బులు తీసుకోలేదని చెప్పడంతో సిబ్బంది బ్యాంకు స్టేట్‌మెంటు పరిశీలించారు. ఈ క్రమంలో ఆమె వేలిముద్ర ద్వారా రూ.లక్షా 70 వేల వరకు తీసుకున్నట్లు గుర్తించారు. దీంతో బాధితురాలు మంగళవారం వాలంటీర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కొయ్యలగూడెం సచివాలయం 2లో వాలంటీర్‌గా పనిచేస్తున్న అయినపర్తి వినయ్ ఈ దారుణానికి పాల్పడినట్లు ఆమె ఆరోపిస్తున్నారు. గతంలో వినోద్ నాగమణి దగ్గర వేలిముద్రలు తీసుకుని పలు దఫాలుగా డబ్బులు అకౌంట్ నుంచి డ్రా చేసినట్లు చెబుతున్నారు. అతడు గ్రామంలో చిన్న షాప్ నడుపుతూ మినీ ఏటీఎం ద్వారా వేలిముద్రలు వేయించుకుని నగదు ఇస్తుంటాడని నాగమణి పేర్కొంది. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version