Vallabhaneni Vamshi: వైఎస్సార్సీపీ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. చంద్రబాబు కావాలనుకుంటే గన్నవరం కాకపోతే.. అస్సాం కూడా వెళ్లొచ్చు అని ఎద్దేవా చేశారు. ఆయన ఓ పని చేస్తే సంసారం.. వేరే వాళ్లు చేస్తే మరొకటా.. అంటూ మండిపడ్డారు.
నడుముకి రాకెట్ కట్టుకుని పైకి వెళ్లు చంద్రబాబు(Vallabhaneni Vamshi)
గన్నవరంలో గత వారం జరిగిన సంఘటనలో ఆధారంగా సెక్షన్ 144, 30 అమలులో ఉన్నపుడు పోలీసులు ఎవరినైనా నియంత్రిస్తారన్నారు. చంద్రబాడు కావాలనుకుంటే ఎక్కడికైనా వెళ్లి రావచ్చన్నారు. నడుముకి రాకెట్ కట్టుకుని పైకి వెళ్లొచ్చని.. గోదావరిలో దూకి కుక్కతోక పట్టుకిన ఈదొచ్చని సెటైర్స్ వేశారు. ముద్రగడను ఇంట్లోంచి బయటకు రాకుండా మూడేళ్లు నియంత్రించారని గుర్తుచేశారు.
మందకృష్ణ మాదిగను ఏపీలోకి రాకుండా ఐదేళ్లు అడ్డుకున్నారన్నారు. అప్పుడు ఏ రాజ్యాంగం ప్రకారం చంద్రబాబు చేశాడని ప్రశ్నించారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటాననడం బాధాకరమన్నారు. బాలకృష్ణ సినిమాలను చంద్రబాబు ఎక్కువగా చూసినట్టున్నారని.. అందుకే బాలయ్య సినిమా డైలాగులు చెబుతున్నాడన్నారు.
రాజకీయాల్లోకి ఎన్టీఆర్ ను పిలవడం పెద్ద జోక్
నారా లోకేష్.. రాజకీయాల్లోకి జూనియర్ ఎన్టీఆర్ ను పిలవడం పెద్ద జోక్ అని.. తెలుగుదేశం ఎప్పటికైనా ఎన్టీఆర్ పార్టీ నే అని వంశీ పేర్కొన్నారు. లోకేష్ కు బొడ్డు ఊడనపుడు జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి ప్రచారం చేశారన్నారు. వాళ్ల తాతాగారి పార్టీని జూనియర్ ఎన్టీఆర్ చూసుకోగలడని వంశీ వ్యాఖ్యానించారు.