Site icon Prime9

Union Minister Kishan Reddy: వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు

Union Minister Kishan Reddy special pooja at Vedagiri Lakshmi Narasimhaswamy temple

Nellore: కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖామంత్రి కిషన్ రెడ్డి నెల్లూరు పర్యటనలో బిజీ బిజీగా గడిపారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. నరసింహకొండలోని వేదగిర లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

దేశం సుభిక్షంగా, ప్రజలంతా క్షేమంగా ఉండాలని ప్రార్ధించారు. ఆలయ ప్రాంగణంలోని గోమాతకు పచ్చగడ్డిని తినిపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో స్థానిక భాజపా నేతలతో కలిసి పట్టభద్రులు, ఉపాధ్యాయులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి, తదితర నేతలతోపాటు ఆయన పాల్గొన్నారు. భాజపాకు మద్ధతు ఇవ్వాలని వారిని కోరారు.

జయభారత్ హాస్పిటల్ లో కొత్తగా ఏర్పాటు చేసిన ఇంటెన్సివ్ కేర్ యూనిట్, క్యాజువాలిటీ వార్డును కేంద్రమంత్రి ప్రారంభించారు. నూతనంగా అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక సదుపాయలతో మెరుగైన వైద్య సేవలను ప్రజలు అందుకోవచ్చన్నారు. అంతకుమందు ఆయన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, విజయవాడ మీడియా వర్క్‌షాప్ ‘వర్తాలాప్’ కిషన్ రెడ్డి ప్రసంగించారు. వారితో జరిపిన చర్చ ఉపయోగకరంగా ఉందని ఆయన తెలిపారు.

ఇది కూడా చదవండి: YSR statue : నిలదీసిన పవన్.. ఇప్పటంలో వైఎస్సార్ విగ్రహం తొలగింపు

Exit mobile version