AP Problems: నేడు ఢిల్లీలో విభజన సమస్యల పై కీలక భేటీ

ఏపీ సమస్యల పరిష్కారం కోసం (నేడు ) గురువారం మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్ తో ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరుపున రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్,

  • Written By:
  • Publish Date - August 25, 2022 / 10:11 AM IST

New Delhi: ఏపీ సమస్యల పరిష్కారం కోసం (నేడు ) గురువారం మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్ తో ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరుపున రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయి రెడ్డి, ఏపీ ఆర్థిక శాఖ కార్యదర్శి ఎస్.ఎస్. రావత్‌తో పాటు ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్, రెసిడెంట్ కమిషనర్ హిమాన్షు కౌశిక్, మరికొందరు అధికారులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. గురువారం జరగబోయే ఈ సమావేశంలో ప్రస్తావించాల్సిన సమస్యలు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులకు సంబంధించి పూర్తి వివరాలను ఆంద్రప్రదేశ్ బృందం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఆగష్టు 24న బుధవారం సాయంత్రం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లో ఈ బృందంలోని అధికారులు, నేతలు అందరు కలిసి సమావేశమయ్యారు.

కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం పొందాల్సిన ప్రాజెక్టులు, వివిధ శాఖల ద్వారా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిల గురించి నివేదికను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇందులో పోలవరం ప్రాజెక్టు ప్రధాన అంశం కానున్నట్లు తెలుస్తుంది. టెక్నికల్‌ అడ్వైజర్‌ కమిటీ నిర్ధారించిన ప్రాజెక్టుకు కావలిసిన నిధులు రూ.55,548.87 కోట్లకు ఆమోదం తెలపాలని, ఏపీ ముఖ్యమంత్రి తాజాగా ఢిల్లీ పర్యటనలో ప్రధానిని కోరినట్లు తెలుస్తుంది. అన్ని జాతీయ ప్రాజెక్టుల్లో వ్యవహరించినట్టుగానే మొత్తం ప్రాజెక్టు వ్యయాన్ని పరిగణలోకి తీసుకుని ఆ మేరకు చేస్తున్న పనులకు వెంటనే రియంబర్స్‌ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన డబ్బు రూ. 2,900 కోట్లు తక్షణమే విడుదల చేయాలని ఏపీ ప్రతినిధుల బృందం కేంద్రాన్ని కోరినట్లు తెలుస్తుంది. మరోవైపు రీసోర్స్‌గ్యాప్‌ కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులు రూ. 32,625.25 కోట్లు వెంటనే మంజూరు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖను కోరే అవకాశం ఉంది.

వీటితో పాటు వేర్వేరు శాఖలకు చెందిన బకాయిలు, రాష్ట్ర ప్రభుత్వానికి రావాలిసిన బకాయిలు, కొత్తగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వైద్య కళాశాలల నిర్మాణానికి చెందిన ఆర్థిక సహాయం, వేర్వేరు ప్రాజెక్టుల అంశాలను ప్రధానంగా ప్రస్తావించే అవకాశం ఉందని సమాచారం.