Site icon Prime9

Dadisetti Raja : రెండుసార్లు వెన్నుపోట్లు.. ఎన్టీఆర్ అంత చేతకాని వ్యక్తి దేశంలోనే లేడు..

Dadisetti Raja

Dadisetti Raja

Dadisetti Raja: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై ఏపీలో వివాదం రేగుతున్న సమయంలో మంత్రి దాడిశెట్టి రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వర్గీయ ఎన్టీఆర్ అంత చేత కాని వ్యక్తి దేశంలో ఎక్కడా లేడని విమర్శించారు. సీఎంగా ఉండి కూడా రెండు సార్లు వెన్నుపోటు పొడిపించుకున్న వ్యక్తి ఎన్టీఆర్ అని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని గుప్పిట్లో ఉంచుకుని కూడా నాదెండ్ల చంద్రబాబు తో రెండుసార్లు వెన్నుపోటు పొడిపించుకున్న నేత ఎన్టీఆర్ అని విమర్శించారు.

గత వారం రోజుల బట్టి చూస్తున్నాను రకరకాల చర్చ జరగుతోంది. స్వర్గీయ ఎన్టీ రామారావు గారిని, సర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని పోల్చుతూ చర్చ జరుగుతోంది. నా వ్యక్తి గత అభిప్రాయం చెబుతున్నాను. రాజశేఖర్ రెడ్డి గారికి, రామారావుకు పోలికే లేదు. ఎన్టీ రామారావు అంత చేతగాని వ్యక్తి భారతదేశం మొత్తంలో ఎవరు లేరు. ఎందుకంటే రాష్ట్రం మొత్తం అతని గుప్పెట్లో ఉండగా, ముఖ్యమంత్రిగా ఉండగా ఒకసారి కాదు రెండు సార్లు వెన్నుపోటు పొడిపించుకున్నారతడు. అందుకే నేను అతను చేతగానివాని వ్యక్తి అంటున్నాను. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి నాదెండ్ల భాస్కరరావుతో ఒకసారి వెన్నుపోటు పొడిపించుకున్నాడు. అల్లుడు చంద్రబాబుతో ఒకసారి వెన్నుపోటు పొడిపించుకున్నాడు.

ఎన్టీ రామారావుకు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డికి ఈ రాష్ట్రంలో పోలికే లేదు. రాజశేఖర్ రెడ్డి ప్రజల మనిషి. ఇది సొంత అభిప్రాయం క్లియర్ గా చెబుతున్నానంటూ మంత్రి దాడిశెట్టి రాజా వ్యాఖ్యానించారు. అమరావతి రైతుల రూపంలో రియల్ ఎస్టేట్ మేళం నియోజకవర్గాల్లో తిరుగుతుందని విమర్శించారు. ఇలాంటి పరిస్థితులు వస్తాయనే ముందుచూపుతో ఎన్టీఆర్ మేళాలను రద్దు చేశారన్నారు. చంద్రబాబు మళ్లీ ఈ మేళాలలో తొడలు కొట్టించి చిల్లర వేషాలు వేయిస్తున్నారని మంత్రి రాజా విమర్శించారు.

Exit mobile version
Skip to toolbar