Site icon Prime9

Ram – Laxman : వారికి సాయం చేయడం కోసం జోళి పట్టి భిక్షాటన చేసిన ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్..

tollywood fight masters begging money for helping old age home

tollywood fight masters begging money for helping old age home

Ram – Laxman : టాలీవుడ్ లో ప్రముఖ ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో తమ ఫైట్స్ తో ప్రేక్షకులను అలరించారు ఈ సోదరులు. అయితే తాజాగా ఈ అన్నదమ్ములు రీసెంట్ గా చేసిన ఒక పని అందర్నీ ఆకట్టుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ లోని చీరాలలో జోళి పట్టి బిక్షాటన చేశారు. ఈ ఘటనతో అందరూ ఒకింత షాక్ అవుతున్నప్పటికి అలా చేయడానికి ఒక బలమైన కారణం ఉందని తెలుస్తుంది.

స్థానికంగా ‘కోటయ్య వృద్ధాశ్రమం’ ఉంది. అయితే వారికి ఒక ఆటో అవసరం అయ్యింది. ఆ ఆశ్రమవాసులకు ఆటో కొనిచ్చేందుకు చీరాలలోని ప్రధాన రహాదారుల్లో జోళి పట్టి బిక్షాటన చేసి ప్రజలు నుంచి నగదు సేకరించారు. ఆ వచ్చిన డబ్బుతో పాటు తమ అకౌంట్స్ నుంచి మరికొంత నగదుని కలిపి ఆ ఆశ్రమానికి అందించారు. అనుకుంటే ఆ మాస్టర్స్ ఇద్దరే ఆ ఖర్చు మొత్తాన్ని ఇవ్వగలిగే వారు కానీ ప్రజల్లో సేవ కార్యక్రమాల పై అవగాహన కలిపించేందుకు, అలాగే వారిని ఒక సేవా కార్యక్రమంలో భాగస్వామ్యం చేసేందుకు ఇలా చేశాం అని వారు వెల్లడించారు. ఇక ఈ ఇద్దరు సోదరులు చేసిన పనికి నెటిజెన్లు సెల్యూట్ చేస్తున్నారు.

 

Exit mobile version