Site icon Prime9

Telugu Desam Party : చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తెదేపా ఆధ్వర్యంలో “కాంతితో క్రాంతి” కార్యక్రమం..

Telugu Desam Party kranthi tho kanthi protest for chandrababu arest

Telugu Desam Party kranthi tho kanthi protest for chandrababu arest

Telugu Desam Party : తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తెదేపా ఆధ్వర్యంలో కాంతితో క్రాంతి కార్యక్రమానికి పిలునిచ్చారు. ఇందులో భాగంగా నేటి రాత్రి 7 గంటల నుంచి 7.05 వరకు ఇళ్లలో లైట్లు ఆపేసి, కొవ్వొత్తులు వెలిగించాలని, సెల్ ఫోన్ లైట్లు ఆన్ చేయాలని, వాహనదారులు లైట్లు వెలిగించి నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు తెదేపా నేతలు, కార్యకర్తలు ఈ ప్రదర్శన చేపట్టారు. ఢిల్లీలో నారా లోకేశ్ కొవ్వొత్తి పట్టుకొని సంఘీభావం ప్రకటించారు. ఇక నారా భువనేశ్వరి రాజమండ్రిలో కాంతితో క్రాంతి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో నారా భువనేశ్వరితో పాటు తెలుగు మహిళలు కూడా దీపాలు వెలిగించి చంద్రబాబు అరెస్ట్ ను నిరసించారు.

Exit mobile version