Site icon Prime9

Tdp vs Ycp : పెద్దాపురంలో హై టెన్షన్ వాతావరణం.. టీడీపీ వర్సెస్ వైసీపీ ఇష్యూ

Tdp vs Ycp issue at peddapuram got trending in ap

Tdp vs Ycp issue at peddapuram got trending in ap

Tdp vs Ycp : కాకినాడ జిల్లా పెద్దాపురంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎవరి హయంలో అవినీతి జరిగిందనే అంశంపై టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ దొరబాబుల నేతలు పరస్పరం సవాళ్లు చేసుకున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ, టీడీపీ నేతలు.. లై డిటెక్టర్ టెస్టు, బహిరంగ చర్చ కోసం మున్సిపల్ సెంటర్‌‌కు వెళ్లేందుకు బయలుదేరారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు బారీగా బలగాలను మోహరించి వారిని అడ్డుకున్నారు. మరోవైపు మున్సిపల్ సెంటర్ వైపు వెళ్లేందుకు యత్నించిన వైసీపీ శ్రేణులను కూడా పోలీసులు అడ్డుకున్నారు. ఇక, టీడీపీ, వైసీపీ శ్రేణులు మున్సిపల్ సెంటర్‌కు చేరుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. శాంతి భద్రతల దృష్ట్యా ఇరువర్గాల ఎలాంటి కార్యక్రమాలకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యగా అదనపు బలగాలను కూడా పెద్దాపురంకు రప్పించారు. దీంతో పెద్దాపురంలో ఎప్పుడు ఏం జరుగుతుందోననే టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది.

YouTube video player

Exit mobile version
Skip to toolbar