Site icon Prime9

Ganta Srinivasarao : తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు‌, ఆయన కుమారుడు అరెస్ట్

tdp mla ganta srinivasarao and his son arrested

tdp mla ganta srinivasarao and his son arrested

Ganta Srinivasarao : మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయడును అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో సీఐడీ అధికారులు శనివారం తెల్లవారుజామున నంద్యాలలో ఆయనను అరెస్ట్ చేశారు. అలానే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు‌ను కూడా ఈరోజు ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. గంటాతో పాటు ఆయన కుమారుడుని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తుంది. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌కు సంబంధించిన కేసులోనే వారిని కూడా అరెస్ట్ చేసినట్టుగా సమాచారం అందుతుంది.

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో గంటా శ్రీనివాసరావు రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ క్రమంలోనే చంద్రబాబుతో కలిసి గంటా శ్రీనివాసరావు ఏపీఎస్‌ఎస్‌డీసీ ఏర్పాటు చేశారని ఏపీ సీఐడీ ఆరోపిస్తుంది. దీనిపై స్పందించిన గంటా శ్రీనివాసరావు.. అమరావతి భూముల కేసులో తన పేరు చేర్చారని మండిపడ్డారు. తనపై ఎన్ని కేసులు పెట్టిన ఎదుర్కొవడానికి సిద్దమేనని చెప్పారు. చంద్రబాబు అరెస్ట్‌ను హేయమైన చర్యగా పేర్కొన్నారు.

అయితే చంద్రబాబు నాయుడి అరెస్టుపై విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చర్యకు ప్రతి చర్య తప్పదంటూ హెచ్చరించారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని.. చంద్రబాబు అరెస్టుకు తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసు పేరుతో చంద్రబాబు నాయుడిని అరెస్టు చేయడం ముమ్మాటికీ రాజకీయ కక్ష సాధింపు చర్యే అని ఫైర్ అయ్యారు. ఎలాంటి ఆధారాలు లేకుండా నోటీసులు ఎలా ఇస్తారు.. కేసులు ఎలా పెడతారు. అంటూ ప్రశ్నించారు.

Exit mobile version