Site icon Prime9

Yuvagalam Padayatra : నేటితో 200 రోజులకు నారా లోకేష్ యువగళం పాదయాత్ర..

tdp leader nara loeksh yuvagalam padayatra completed 200 days

tdp leader nara loeksh yuvagalam padayatra completed 200 days

Yuvagalam Padayatra : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసుకుంది. జనవరి 27న కుప్పంలో ప్రారంభమైన లోకేశ్ పాదయాత్ర ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాకు చేరింది. లోకేష్ చేపట్టిన ఈ పాదయాత్రలో 400 రోజుల్లో 4 వేల కిలోమీటర్లు లోకేష్ నడవనున్నారు. అయితే నేటితో లోకేశ్ పాదయాత్రకు 200 రోజులు పూర్తి కానుండగా.. 77 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2,710 కిలోమీటర్లు మేర లోకేశ్ నడవడం గమనార్హం. కాగా మొత్తంగా 185 మున్సిపాలిటీలు, మండలాలు, 1675 గ్రామాల మీదుగా యువగళం పాదయాత్ర సాగింది.

అదే విధంగా ఇప్పటి వరకు ఏ జిల్లాలో ఎన్ని రోజులు, ఎన్ని కిలోమీటర్లు,  పాదయాత్ర చేశారంటే..

చిత్తూరు –  45 రోజులు – 577 కిలోమీటర్లు

అనంతపురం – 23 రోజులు – 303 కిలోమీటర్లు

కర్నూలు  – 40 రోజులు – 507 కిలోమీటర్లు

కడప  – 16 రోజులు – 200 కిలోమీటర్లు

నెల్లూరు  – 31 రోజులు – 459 కిలోమీటర్లు

ప్రకాశం  – 17 రోజులు – 220 కిలోమీటర్లు

గుంటూరు  – 16 రోజులు – 236 కిలోమీటర్లు

కృష్ణా జిల్లా  – 8 రోజులు – 113 కిలోమీటర్లు

పశ్చిమ గోదావరి జిల్లా – కొనసాగుతుంది..

 

 

 

Exit mobile version