Site icon Prime9

EX MLA Dayakar Reddy : తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి మృతి..

tdp ex mla kothakota dayakar reddy passed away

tdp ex mla kothakota dayakar reddy passed away

EX MLA Dayakar Reddy : తెలంగాణ సీనియర్ రాజకీయ నాయకుడు, మక్తల్ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి ఈ లోకాన్ని వీడారు. కొంతకాలంగా అనారోగ్య కారణాలతో హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. ఈరోజు ( జూన్ 13, 2023 ) తెల్లవారుజామున మృతి చెందారని సమాచారం అందుతుంది. దయాకర్ మరణంపై సీఎం కేసీఆర్, టీడీపీ అధినేత చంద్రబాబు సంతాపాన్ని వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా తమ సంతాపాన్ని ప్రకటించారు.

దయాకర్ రెడ్డి అనారోగ్య కారణాలతో ఈ మధ్యే ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత కోలుకుని మహబూబ్‌నగర్ జిల్లాలోని తన స్వగ్రామమైన పర్కపురంలో ఉంటున్నారు. అయితే మరోసారి ఆరోగ్య పరిస్థితి క్షీనించడంతో తిరిగి హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. కాగా దయాకర్‌రెడ్డి దంపతులు గతేడాది ఆగస్టులో తెలుగు దేశం పార్టీకి రాజీనామా చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే టీడీపీని వీడాల్సి వస్తుందని కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే ఆ తర్వాత మరో పార్టీకి వెళ్తారని ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత ఏ పార్టీలో చేరలేదు.

(EX MLA Dayakar Reddy) రాజకీయ ప్రస్థానం..  

కొత్తకోట దయాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాలోకి వచ్చి 1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అమరచింత నియోజకవర్గం (ప్రస్తుతం దేవరకద్ర నియోజకవర్గం) నుంచి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి కొల్లికొదురు వీరారెడ్డి చేతిలో 6751 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆ తర్వాత 1994, 1999లో అమరచింత నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1994లో 44963 ఓట్ల మెజారిటీతో , 1999లో 22307 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి కొల్లికొదురు వీరారెడ్డి పై గెలుపొందారు. 2009లో మక్తల్ నుంచి టీడీపీ నుంచి పోటీచేసి గెలుపొందారు. దయాకర్ రెడ్డి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.

 

 

Exit mobile version