Site icon Prime9

Kakani Govardhan Reddy: తెదేపాకు సమస్యలపై చర్చించే దమ్ము లేదు

TDP does not have the guts

TDP does not have the guts

Amaravati: అసెంబ్లీలో టీడీపీ సభ్యుల ప్రవర్తన సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను చర్చించకుండా విలువైన సభా సమయాన్ని వృధా చేస్తున్నారని మండిపడ్డారు. బయట మీడియా ముందు డ్రామాలు ఒక్కటే తెదేపాకు తెలుసునని మంత్రి కాకాని ఎద్దేవా చేశారు. మూడు రాజధానుల విషయం సీఎం జగన్ వివరణతో ప్రజల్లో చర్చ ప్రారంభమైందన్నారు. అవగాహన, అనుభవం లేని వ్యక్తి మాటలు పట్టించుకోవద్దంటూ పరోక్షంగా చంద్రబాబు పై మాట్లాడారు.

పవన్ కళ్యాణ్ నటుడు మాత్రమేనని మంత్రి కాకాని పేర్కొన్నారు. రాజకీయ అనుభవం లేదు కాని రెండు చోట్ల ఓడిపోయిన ఘనత మాత్రం ఉందని పవన్ కు చురకలంటించారు. నెల్లూరు జిల్లాలో మంత్రి కాకాణి, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిల మద్య నిత్యం మాటలు తూటాల్లా పేలుతుంటాయి. ఈ నేపధ్యంలో మంత్రి తెలుగుదేశం ఎమ్మెల్యేల పై విరుచుకపడ్డారు.

Exit mobile version