Site icon Prime9

Electric Shock : నరసరావుపేటలో విషాదం.. అభిమాన హీరో ఫ్లెక్సీ కడుతూ షార్ట్ సర్క్యూట్ తో ఇద్దరు మృతి

surya fans died in Electric Shock at narasaraopeta

surya fans died in Electric Shock at narasaraopeta

Electric Shock : ప్రముఖ హీరో సూర్య పుట్టిన రోజు పురస్కరించుకొని తమిళనాట అభిమానులు నెక్స్ట్ లెవెల్లో సెలబ్రేషన్స్ చేస్తున్నారు. కాగా సూర్యకి తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ మేరకు ఏపీలో సూర్య బర్త్ డే ని సెలబ్రేట్ చేయడానికి ప్లాన్ చేసిన అభిమానులు ఊహించని రీతిలో మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటన పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగిందీ ఘటన.

ఈ అనూహ్య ఘటన వివరాల్లోకి వెళ్తే.. సూర్య పుట్టిన రోజును పురస్కరించుకుని మోపూరివారిపాలేనికి చెందిన వెంకటేశ్, బాపట్ల జిల్లా జే పంగలూరుకు చెందిన సాయి స్నేహితులతో కలిసి గత రాత్రి నరసరావుపేటలో ఫ్లెక్సీలు కడుతుండగా దాని ఐరన్ ఫ్రేమ్ పక్కనే ఉన్న విద్యుత్ తీగలకు తాకింది. దీంతో విద్యుదాఘాతానికి గురైన విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతులను నక్కా వెంకటేశ్, పోలూరు సాయిగా గుర్తించారు. వీరిద్దరూ డిగ్రీ సెకండియర్ విద్యార్థులు మృత్యువాత పడ్డారు.

ప్రముఖ తమిళ నటుడు సూర్య అంటే తెలియని వారు ఉండరు. తమిళ నటుడే అయిన తెలుగులో కూడా స్టార్ హీరోలకు సమానంగా క్రేజ్ సంపాదించుకున్నాడు. కంటెంట్ ఉన్న సినిమాల్లో నటించి సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. గజిని, సింగం వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక ఇటీవల వచ్చిన ఆకాశం నీ హద్దురా, జై భీమ్, విక్రమ్ వంటి సినిమాలతో నెక్స్ట్ లెవెల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం శివ దర్శకత్వంలో “కంగువా” అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇక సూర్య- జ్యోతిక జంట 2006లో ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వారికి దియా, దేవ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Exit mobile version