Site icon Prime9

Nara Chandrababu Naidu : ఫైబర్‌నెట్‌ కేసులో చంద్రబాబుకు ఊరట.. అప్పటి వరకు అరెస్ట్ చేయొద్దన్న సుప్రీం కోర్టు

supreme-court-adjourns-nara chandrababu-naidu-bail-petition-in-ap-fibernet-case

supreme-court-adjourns-nara chandrababu-naidu-bail-petition-in-ap-fibernet-case

Nara Chandrababu Naidu : ఏపీ ఫైబర్‌ నెట్‌ కేసులో తెదేపా అధినేత చంద్రబాబుకు ఊరట లభించింది. ఆ కేసులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టు విచారణను వాయిదా వేస్తూ తీర్పు ఇచ్చింది. ఈనెల 30న విచారణ చేపడతామని జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేది ధర్మాసనం తెలిపింది. అలానే ఫైబర్‌నెట్‌ కేసులో ఈనెల 30 వరకు చంద్రబాబును అరెస్ట్‌ చేయొద్దని ఆదేశించింది.

మరోవైపు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తీర్పును దీపావళి సెలవుల తర్వాత వెల్లడిస్తామని సుప్రీం కోర్టు తెలిపింది. సెక్షన్‌ 17ఏ నిబంధన ఈ కేసులోనూ ఉన్నందున స్కిల్‌ కేసు తీర్పు వచ్చాక విచారిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేసు విచారణను ఈనెల 23కి వాయిదా వేయాలని తొలుత ధర్మాసనం నిర్ణయించింది. అయితే సిద్ధార్థ లూథ్రా విజ్ఞప్తి మేరకు విచారణను సుప్రీంకోర్టు ఈనెల 30కి వాయిదా వేసింది.

Exit mobile version