Site icon Prime9

Mla Saiprasad Reddy: వైకాపా ఎమ్మెల్యేకు వింత అనుభవం

Strange experience for Ysrcp MLA

Strange experience for Ysrcp MLA

Adoni: వైఎస్సీఆర్సీపి పార్టీకి గడప గడప కార్యక్రమాలతో వివిధ రకాల సమస్యలు, వ్యతిరేకతలు, ఆందోళనలు ఎదురౌతుండగా తాజాగా ఓ ఎమ్మెల్యేకు వింత అనుభవం ఎదురైంది. ఆ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకొనింది.

ఆదోని పట్టణం వాల్మీకి నగర్‌లో గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. లబ్ధిదారులతో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను వివరించారు. అమలౌతున్న పథకాలను ఎవరు ఇస్తున్నారని ఈరమ్మ అనే మహిళను ఎమ్మెల్యే అడిగారు. అందుకు చంద్రబాబు ఇస్తున్నాడని మహిళ చెప్పడంతో శాసనసభ్యులు సాయి ప్రసాద్ తోపాటు అందరూ షాక్ గురయ్యారు. ఒకింత ఆశ్చర్యానికి గురైనారు.

జగన్ ఫొటోను చూపి ఈయన ఎవరో తెలుసా ?అని ఎమ్మెల్యే అడగగా మహిళ చెప్పలేక పోయింది. దీంతో ఎమ్మెల్యే పక్కన ఉన్న కార్యకర్తలు నవ్వుకోవడం జరిగింది. ఎమ్యెల్యే సాయి ప్రసాద్ రెడ్డే స్వయంగా వైఎస్ రాజశేఖర్ కొడుకు జగన్ అని చెప్పుకొనే పరిస్ధితి ఎదురైంది.

ఇది కూడా చదవండి: Nara Lokesh: వైసిపి రాజకీయ యాత్ర తుస్.. నారా లోకేష్

Exit mobile version