Stop Vande Bharat train at Kuppam: కుప్పంలో వందే భారత్ రైలును ఆపండి…రైల్వే శాఖకు చంద్రబాబు లేఖ

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైల్వే మంత్రికి లేఖ వ్రాశారు. కుప్పంలో వందే భారత్ రైలుకు స్టాపింగ్ ఇవ్వాలంటూ అందులో పేర్కొన్నారు.

Chandrababu Naidu: దక్షిణ భారత దేశంలో వందే భారత్ రైలు పట్టాలెక్కాయి. ప్రధానమంత్రి మోదీ బెంగళూరులో ఈమేరకు వందే భారత్ రైలుకు పచ్చ జెండా ఊపిని సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైల్వే మంత్రికి లేఖ వ్రాశారు. కుప్పంలో వందే భారత్ రైలుకు స్టాపింగ్ ఇవ్వాలంటూ అందులో పేర్కొన్నారు. ఈ మేరకు లేఖను వందేభారత్ రైలు చీఫ్ కమర్షియల్ మేనేజర్ కు తెదేపా నేతలు అందించారు.

కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రా 3 రాష్ట్రాల కూడలిలో కుప్పం కేంద్రబిందువుగా ఉందని లేఖలో చంద్రబాబు తెలిపారు. ద్రావిడ వర్సిటీ, పీఈఎస్ మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులు, నిత్యం కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు రాకపోకలు కొనసాగిస్తుంటారని, కుప్పంలో రైలు ఆగితే అందరికీ ఉపయోగమని లేఖలో చంద్రబాబు ప్రస్తావించారు. అయితే రైల్వే శాఖ ఏ మేరకు స్పందిస్తో వేచి చూడాలి. 160కి.మీ వేగంతో వందేభారత్ రైలు స్పీడుగా నిర్ణయించడంతో ప్రయాణ దూరం తగ్గి అందరికి అందుబాటులోకి రావడాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Vande Bharat Express : దక్షిణాదిన మొదటి వందేభారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ