Harirama Jogaiah : సీఎం జగన్‌కు హరిరామ జోగయ్య లేఖ.. అప్పుడు సీఎం ఎవరు అంటూ ప్రశ్న !

ఏపీలో రోజురోజుకీ పొలిటికల్ హీట్ పెరిగిపోతుంది. రాబోయే ఎన్నికలే ధ్యేయంగా అధికార, ప్రతిపక్ష పార్టీల యాత్రలు, సభలు, సమావేశాల వేదికగా విమర్శలు.. మాటల యుద్ధాలకు తెరలేపుతూ ఎవరి పంథాలో వారు దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య

  • Written By:
  • Publish Date - June 27, 2023 / 03:35 PM IST

Harirama Jogaiah : ఏపీలో రోజురోజుకీ పొలిటికల్ హీట్ పెరిగిపోతుంది. రాబోయే ఎన్నికలే ధ్యేయంగా అధికార, ప్రతిపక్ష పార్టీల యాత్రలు, సభలు, సమావేశాల వేదికగా విమర్శలు.. మాటల యుద్ధాలకు తెరలేపుతూ ఎవరి పంథాలో వారు దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య తాజాగా ఒక లేఖ విడుదల చేశారు. మరోసారి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. గతంలో సీఎం వైఎస్‌ జగన్‌తో పాటు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంకి లేఖలు రాసిన ఆయన.. ఈ సారి సీఎం జగన్‌కు రాసిన లేఖలో పలు సంచలన విషయాలను లేవనెత్తారు.

కాగా ఆ లేఖలో..  మీపై సీబీఐ, ఈడీ విచారణ చేసి క్విడ్‌ప్రోకో కింద, మనీ ల్యాండరింగ్‌ కింద సీబీఐ 11 కేసులు, ఈడీ ఆరు కేసులు బనాయించాయి.. 16 నెలలు జైలు శిక్ష అనుభవించి బెయిల్‌పై విడుదలయ్యారు.. కానీ, ముఖ్యమంత్రిపై ఉన్న కేసుల్లో సీబీఐ కోర్టులో ఇంకా విచారణలో ఉన్నాయి.. కోర్టులు ఏ కారణం చేతైనా మిమ్మలను దోషులుగా ప్రకటిస్తే.. సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వస్తే.. మీ వారసులుగా రెడ్డి కులస్తులను ముఖ్యమంత్రిగా ప్రకటిస్తారా..? లేక కాపు బడుగు బలహీన వర్గాల వారిని వారసులుగా ప్రకటిస్తారా? ఈ విషయాన్ని చెప్పాలని డిమాండ్‌ చేశారు.. దీని ద్వారా బడుగు బలహీన వర్గాలపై మీకున్న కమిట్‌మెంట్‌ చూసి గర్వపడతామని లేఖలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని బహిరంగ ప్రకటన ద్వారా ప్రజలకు తెలియజేయాలని మిమ్మల్ని కోరుతున్నానంటూ.. సీఎం వైఎస్‌ జగన్‌ ను హరిరామ జోగయ్య ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.