Site icon Prime9

Apsrtc: ఆర్టీసీ డ్రైవర్ నిర్వాకం.. నడి రోడ్డుపై బస్సును ఆపి పరార్

RTC driver was inhuman..he stopped the bus on the road and ran away

RTC driver was inhuman..he stopped the bus on the road and ran away

Nuziveedu Depot: ఏపీలో ఓ ఆర్టీసి డ్రైవర్ అమానుషంగా ప్రవర్తించాడు. నడిరోడ్డుపై బస్సును ఆపి పరారైనాడు. వివరాల మేరకు, నూజివీడు డిపోకు చెందిన ఓ నాన్ స్టాప్ బస్సు 40 మంది ప్రయాణీకులతో విజయవాడ బయల్దేరింది. ప్రయాణీకులందరికి టిక్కెట్లు ఇచ్చిన డ్రైవర్ రమేష్ మార్గమధ్యంలో బస్సును రోడ్డు పక్కన నిలిపి పరారైనాడు.

దీంతో కంగారుపడిన ప్రయాణీకులు సమాచారాన్ని డిపో అధికారులకు చేరవేశారు. మరో బస్సును ఏర్పాటు చేసి ప్రయాణీకులను వారి వారి గమ్యస్థానాలకు తరలించారు. విచారణలో ఔట్ సోర్సింగ్ సిబ్బందిగా డ్రైవర్ ను గుర్తించారు. డ్యూటీ సమయంలో మద్యం సేవించడం, ప్రయాణీకుల పట్ల అనుచిత ప్రవర్తన, నిర్లక్ష్యం కారణంగా డ్రైవర్ రమేష్ ను విధులు నుండి తొలగిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: ఏపీ ప్రభుత్వానికి షాక్..వివేకా హత్యకేసు వేరే రాష్ట్రం బదిలీకి సుప్రీం కోర్టు ఓకే

Exit mobile version