Road Accident : కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని కోడుమూరు సమీపంలో పెట్రోల్ బంక్ దగ్గర బొలెరో వాహనాన్ని ఐచర్ వాహనం ఢీకొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒకరు పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది. కాగా క్షతగాత్రులను చికిత్స కోసం కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులు, గాయపడినవారు హోళగుంద మండలం కొత్తపేట గ్రామస్తులుగా గుర్తించారు. హోళగుంద నుంచి తెలంగాణ రాష్ట్రం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ఈ విషాద వార్తతో వారి స్వగ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
Road Accident : కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి, 13 మందికి తీవ్ర గాయాలు

Road Accident in ysr district potladurthi village leads to 4 death