Site icon Prime9

Road Accident : కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 4 మృతి, 9 మందికి తీవ్ర గాయాలు

Road Accident in ysr district potladurthi village leads to 4 death

Road Accident in ysr district potladurthi village leads to 4 death

Road Accident : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆలమూరు మండల పరిధిలోని మడికి నేషనల్ హైవేపై వ్యాన్, కారు ఢీకొన్నాయి. అనకాపల్లి సమీపంలోని చోడవరానికి చెందిన 9 మంది టాటా మ్యాజిక్ వ్యాన్‌లో కొత్తపేట మండలం మందపల్లికి దైవదర్శనం కోసం వెళ్ళి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో వ్యాన్‌లో ప్రయాణిస్తున్న ముగ్గురు, కారులో ప్రయాణిస్తున్న ఒక్కరు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. కాగా మరో 9 మందికి గాయాలవ్వగా.. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అలాగే హైవేప భారీ ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రయాణికులు దానిని  కంట్రోల్ చేశారు. ముందుగా విశాఖ నుంచి వస్తున్న కారు అదుపు తప్పి వ్యాన్‌ను ఢీకొంది. వేగం కూడా కారణమని చెబుతున్నారు. ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version