Site icon Prime9

Road Accident : కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది ఏపీ వాసులు మృతి

Road Accident in karnataka leads to 12 members from ap death

Road Accident in karnataka leads to 12 members from ap death

Road Accident : కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్‌ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న ట్యాంకర్‌ను – సుమో వాహనం వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం అందుతుంది. కాగా వీరంతా ఆంధ్రప్రదేశ్‌ లోని శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

ఏపీ చెందిన వీరంతా వలస కూలీలుగా జీవనం సాగిస్తుండగా.. దసరా పండుగ నేపధ్యంలో సొంతూళ్లకు వెళ్లారని.. తిరిగి ఉపాధి కోసం బెంగళూరులోని హొంగసంద్ర వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. తెల్లవారుజామున పొగమంచు కారణంగా సుమో డ్రైవర్‌.. ఆగి ఉన్న ట్యాంకర్‌ ని గమనించకుండా ఢీ కొట్టాడని భావిస్తున్నారు. ఆ సమయంలో వాహనంలో 14 మంది ప్రయాణిస్తుండగా ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

మిగిలిన వారిని చిక్‌బళ్లాపూర్‌ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మరో 7 మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే మృతుల్లో 8 మంది పురుషులు, ముగ్గురు మహిళలు, ఓ బాలుడు ఉన్నట్లు తెలుస్తుంది. వీరి మరణవార్తతో వారి స్వగ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

Exit mobile version