Site icon Prime9

Ramana Dikshithulu: తిరుమలలో ప్రకటన చేస్తారనుకొన్నా.. ట్వీట్ చేసిన రమణ దీక్షితులు

Ramana Dixitulu tweeted to the CM

Ramana Dixitulu tweeted to the CM

Tirumala: నాటి ప్రభుత్వంలో మాకు ఎలాంటి స్వేచ్ఛ లేదన్నారు. హక్కులను కాల రాస్తున్నారన్నారు. చివరకు వృత్తి బాధ్యతలను పక్కన బెట్టీ ప్రభుత్వం పై తిరుగుబాటును తలపిస్తూ ఎడా పెడా మాట్లాడేసారు. అయితే కొత్త ప్రభుత్వం వచ్చి మూడు సంవత్సరాలకు పైబడి అవుతున్నా నాడు గొంతెత్తిన గొంతులు మూగబోతున్నాయి. సరికదా ఇది చేస్తారనుకొన్నాము అంటూ ట్వీట్ లతో సరిపెట్టుకొంటున్నారు. తాజాగా ఏపీ సీఎం జగన్ తిరుమల పర్యటన పై ప్రధాన పురోహితులు రమణ దీక్షితులు సీఎంకు ట్వీట్ చేస్తూ తన అసహనాన్ని వ్యక్త పరిచడం చర్చగా మారింది.

మీ తిరుమల పర్యటనలో వన్ మ్యాన్ కమిటీ రిపోర్ట్ అమలు పై ప్రకటన చేస్తారని మేము భావించాము. మీరు ఎలాంటి ప్రకటన చేయ్యకపోవడంతో అర్చకులందరూ తీవ్ర నిరాశ చెందాము. తిరుమల తిరుపతి దేవస్ధానంలోని బ్రాహ్మణ వ్యతిరేకులు, అర్చక వ్యవస్ధను, ఆలయ విధానాలను నాశనం చేసే లోపే తగిన చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నట్లు రమణ దీక్షితులు తన ట్వీట్ లో పేర్కొన్నారు.

టీటీడీలో వంశపారంపర్యంగా వచ్చే అర్చకుల శాశ్వత నియామకం పై ఏపీ ప్రభుత్వం ఏక సభ్య కమిటీని నియమించి ఉంది. వారసత్వ అర్చకుల వ్యవస్థ బలోపేతం, క్రమబద్ధీకరణ కోసం ఏర్పాటు చేసిన కమిటీ టీటీడీలో వారసత్వ అర్చక విధానాన్ని మరింత బలంగా అమలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలను ఈ కమిటీ సూచించనుంది. ఇందుకు హైకోర్టు రిటైర్డ్ జడ్జి బి. శివ శంకర్‌రావుని కమిటీ ఛైర్మన్‌గా నియమించింది.

గతంలో కలియుగ వైకుంఠం శ్రీవారి ఆలయంలో కైంకర్యాలు నిర్వహించే భాగ్యం మిరాశీ వంశీకులకు చెందిన నాలుగు కుంటుంబాలకు మాత్రమే ఉండేది. 1986లో మిరాశీ వ్యవస్థను రద్దు చేసారు. తర్వాత కోర్టు తీర్పులు, వరుసగా వస్తున్న ప్రభుత్వాలు తీసుకొచ్చిన మార్పులు అన్నీ కలిపి దేవాలయంలో పూజా హక్కులకు సంబంధించి పలు పరిణామాలు మార్పులు చోటుచేసుకొన్నాయి.

దీంతో శ్రీవారి ఆలయంలో ప్రస్తుతం 52 మంది అర్చకులు ఉండగా వారిలో 48 మంది అర్చకులు సర్వీస్‌ రికార్డ్‌-ఎస్‌ఆర్‌ విధానానికి మొగ్గు చూపారు. ఇలా మిరాశీ వంశీకులకు, టీటీడీకి మధ్య అన్ని విషయాలు సర్దుబాటు అయ్యాయి అని భావిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ వన్ మ్యాన్ కమిటీని నియమించింది.

తిరుమలలో అన్యమత ప్రచారం సాగుతుందని ప్రతిపక్షాలు పదే పదే వాదిస్తున్నాయి. అందుకు సంబంధించిన అనేక రుజువులు కూడా ప్రతిపక్షాలు చూపించి వున్నాయి. తాజాగా రమణ దీక్షితులు సీఎం జగన్ కు జత చేసిన ట్వీట్ లో బ్రాహ్మణ వ్యతిరేకులు, వ్యవస్ధలను నాశనం చేసే లోపు నిర్ణయం తీసుకోండి అని చెప్పడం బట్టి చూస్తూ తిరుమలలో లోలోపల పెద్ద వ్యవహరమే నడుస్తుందని తెలుస్తుంది.

ఇది కూడా చదవండి: డిప్యూటీ సీఎంకు చేదు అనుభవం

Exit mobile version