Rajinikanth: స్వర్గీయ నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలకు ఎన్టీఆర్ పుట్టిన జిల్లాలో అంకురార్పణ జరుగనుంది. అందుకు తగిన ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్బంగా ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో పాల్గొనేందుకు సూపర్ స్టార్ రజినీ కాంత్ విజయవాడకు వచ్చారు. గన్నవరంలో ఎయిర్ పోర్టులో స్వయంగా బాలకృష్ణ వెళ్లి ఆయన కు ఘన స్వాగతం పలికారు. ఈరోజు సాయంత్రం పోరంకి అనుమోలు గార్డెన్స్ లో ఎన్టీఆర్ శతజయంతి అంకుర్పారణ సభ జరగనుంది.
2004 తర్వాత ఇపుడే.. (Rajinikanth)
ఈ కార్యక్రమానికి రజనీ కాంత్ తో పాటు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిలుగా పాల్గొననున్నారు. రజనీకాంత్ గతంలో 2004 కృష్ణానది పుష్కరాల్లో పాల్గొనేందుకు కృష్ణా జిల్లాకు వచ్చారు. అనంతరం మళ్లీ ఇపుడు ఎన్టీఆర్ శతజయంతి అంకుర్పారణ సభలో పాల్గొనేందుకు విజయవాడ వచ్చారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ చారిత్రక ప్రసంగాల పుస్తకాలను ఆవిష్కరించనున్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు అసెంబ్లీలో ఆయన చేసిన ప్రసంగాలు, పలు సందర్భాల్లో ప్రజలను చైతన్య పరుస్తూ చేసిన ప్రసంగాలతో ఈ పుస్తకాలను పొందుపరిచారు.
చంద్రబాబు ఇంట్లో తేనీటి విందు(Rajinikanth)
కాగా, ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో పాల్గొనేందుకు సూపర్ స్టార్ రజినీ కాంత్ శుక్రవారం సాయంత్రం టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటికి వెళ్లనున్నారు. రజనీకాంత్ ను తేనీటి విందుకు చంద్రబాబు ఆహ్వానించారు. సాయంత్రం 3 గంటలకు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి సూపర్ స్టార్ వెళ్లనున్నారు. అక్కడ తేనీటి విందు అయిన తర్వాత రజినీ కాంత్ ,బాలకృష్ణ , చంద్రబాబు, ఇతర కుటుంబ సభ్యులు అందరూ కలిసి పోరంకి అనుమోలు గార్డెన్స్ కి వెళతారు. అక్కడ జరగనున్న ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు.