Andhra Pradesh: అధికార పార్టీ వైకాపా ఆగడాలు రోజు రోజుకు ఎక్కువైపోతున్నాయి. దీంతో ప్రజల వైపు నుండి కూడా వైకాపా శ్రేణులకు భంగపాటు కలుగుతుంది. తాజాగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి నిరసనల సెగ తగిలింది. హిందూపురం పర్యటనలో ఆయనకు ఈ ఘటన ఎదురైంది.
రూరల్ మండలం చౌళూరులో వైఎస్సాఆర్సీపీ మాజీ కన్వీనర్ రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి మృతచెందాడు. ఆ కుటుంబాన్ని పరమర్శించేందకు మంత్రి అక్కడకు చేరుకొన్నారు. అన్ని రకాలుగా వేధించి హింసించి హత్య చేశారంటూ కుటుంబసభ్యులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రాణహానీ ఉందంటూ పోలీసులు దృష్టికి తీసుకెళ్లిన్నప్పటికీ వారు పట్టించుకోలేదని తెలిపారు. మంత్రి పెద్ది రెడ్డి వాహనాన్ని మృతుడి బంధువులు అడ్డగించి ఆందోళనలకు దిగారు.
మృతికి కారణమైన ఎమ్మెల్సీ ఇక్బాల్ కారణమంటూ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రామకృష్ణారెడ్డి హిందూపురం నుంచి తన ఇంటికి చేరుకుని క్రమంలో ఆయన పై దాడికి పాల్పడ్డారు. విచక్షణ రహితంగా శరీరం పై దాడి చేయడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయిడు. పరిపాలన పేరుతో రాష్ట్రంలో హింసాత్మక ఘటనలకు అధికార పార్టీ శ్రేణులు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో రాజకీయ పార్టీల దగ్గర నుండి ప్రజల వరకు ఆ పార్టీ వ్యతిరేకతను మూటగట్టుకొంటుంది.
ఇది కూడా చదవండి: వైకాపా అసమ్మతి నేత దారుణ హత్య.. వేటకొడవళ్లతో వెంటాడి మరీ..!