Site icon Prime9

ACB Court Judge Hima Bindu : ఏసీబీ కోర్టు జడ్జి హిమబిందుకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులపై చర్యలు.. రాష్ట్రపతి భవన్ నుంచి లేఖ

president bhavan responce over negative posts on ACB Court Judge Hima Bindu

president bhavan responce over negative posts on ACB Court Judge Hima Bindu

ACB Court Judge Hima Bindu : స్కిల్  డెవలప్ మెంట్ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి రిమాండ్ లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే చంద్రబాబు అరెస్ట్ తర్వాత  సీఐడీ తరఫున వాదనలు వినిపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డికి,  న్యాయమూర్తి సత్య వెంకట హిమబిందుకు బాబు అరెస్టు తర్వాత అదనపు భద్రత కల్పించారు. కానీ  న్యాయమూర్తి సత్య వెంకట హిమబిందుకు వ్యతిరేకంగా గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో  రావడం గమనించవచ్చు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాష్ట్రపతి భవన్ కార్యదర్శి పీసీ మీనా లేఖ రాశారు.

హైకోర్టు న్యాయవాది రామనుజం.. జడ్జి హిమబిందుకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టుల వల్ల ఆమె హోదా, గౌరవాన్ని కించపరిచినట్టుగా అవుతుందని  రాష్ట్రపత్రి ద్రౌపది ముర్ముకు ఫిర్యాదు చేశారు. బాధ్యతయుతంగా విధులు నిర్వర్తిస్తున్న జడ్జి వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నారని.. ఇది ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దాంతో రాష్ట్రపతి భవన్ కార్యదర్శి పీసీ మీనా స్పందించారు.

ఈ క్రమంలోనే ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. సోషల్ మీడియాలో జడ్జి హిమబిందుపై వస్తున్న పోస్టులపై చర్యలు తీసుకోవాలని పీసీ మీనా ఆదేశించారు. ఈ మేరకు తీసుకున్న చర్యలను ఫిర్యాదు దారులకు వివరించాలని లేఖ రాశారు.

Exit mobile version