Site icon Prime9

Amaravati JAC: వైసీపీ నేతలు అడ్డుకోవడం పై హైకోర్టులో పిటిషన్ వేసిన పాదయాత్ర రైతులు

Padayat farmers filed a petition in the High Court against the obstruction of YCP leaders

Padayat farmers filed a petition in the High Court against the obstruction of YCP leaders

Amaravati: ఏపీ హైకోర్టు అనుమతితో అమరావతి టు అరసువల్లి కి చేపట్టిన రాజధాని రైతుల జేఎసి పాదయాత్రను పదే పదే వైకాపా నేతలు అడ్డుకోవడంపై రైతులు హైకోర్టులో పిటిషన్ వేశారు. అమరావతి పరిరక్షణ సమితి తరపున సీనియర్ న్యాయవాది మురళీధర్ పిటిషన్ దాఖలు చేశారు. పాదయాత్ర జరుగుతున్న సమయంలో అధికార పార్టీ నేతల నిరసనలు, సభలకు ఏపి ప్రభుత్వం, పోలీసులు అనుమతి ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఏపీ రాజధానిగా అమరావతినే ప్రభుత్వం ప్రకటించాలని ఆ దిశగా అడుగులు వేయాలని అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గత నెలలో రాజధాని రైతులు రెండవ పాదయాత్రను చేపట్టివున్నారు. ఈ క్రమంలో ఏపి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో, కోర్టు నుండి లభించిన అనుమతితో రైతులు పాదయాత్ర ప్రారంభించారు. పలు నియోజకవర్గాల్లో వారిని అడ్డుకొనేందుకు అధికార పార్టీ వైకాపా శ్రేణులు అనేక పర్యాయాలు ప్రయత్నించారు. పదే పదే వ్యక్తిగతంగా విమర్శించారు. మూడు రాజధానులకే మా మద్ధతు అంటూ పాదయాత్ర మార్గంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి పాదయాత్ర రైతులను రెచ్చగొట్టారు.

ఒక దశలో వారిని అడ్డుకోవాలంటూ రాష్ట్రానికి చెందిన మంత్రులు అంబటి రాంబాబు, బొత్స సత్యన్నారాయణ, ధర్మాన ప్రసాదారావుతోపాటు పలువురు ఎమ్మెల్యేలు అసభ్యకరంగా మాట్లాడారు. ప్రాంతాల మద్య చిచ్చురేగేలా ప్రవర్తించారు. కొందరైతే తొడలు కొట్టి మరీ రెచ్చగొట్టారు. అయినా పాదయాత్ర రైతులను నుండి మౌనమే సమాధానం రావడంతో వైకాపా ఎంపీ భరత్ మరింతగా రెచ్చిపోయారు. మహిళలు, పెద్దలు అని చూడకుండా పాదయాత్రలో పాల్గొన్న వారిపై నీళ్ల బాటిళ్లు, చెప్పులు విసిరి వ్యవహారాన్ని మరింత జఠిలం చేశారు. ఇక చేసేది లేక రాజధాని రైతులు మరో మారు న్యాయస్ధానం మెట్టు ఎక్కి తమకు జరుగుతున్న అన్యాయాన్ని ఆపాలంటూ మొర పెట్టుకొంటున్నారు.

ఇది కూడా చదవండి: Shock for AP government: ఏపీ ప్రభుత్వానికి షాక్..వివేకా హత్యకేసు వేరే రాష్ట్రం బదిలీకి సుప్రీం కోర్టు ఓకే

Exit mobile version