Site icon Prime9

AP High Court: పాదయాత్రకు 600మందికి మాత్రమే అనుమతి.. స్పష్టం చేసిన హైకోర్టు

Only 600 people are allowed for the padayatra

Only 600 people are allowed for the padayatra

Amaravati: అమరావతి రాజధాని రైతుల మహా పాదయాత్రలో 600మంది మాత్రమే పాల్గొనాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు తగిన బాధ్యతలు చూసేలా పోలీసులు చర్యలు చేపట్టాలని కోర్టు ఆదేశించింది.  రైతులు చేపట్టిన పాదయాత్రను పదే పదే అడ్డుకొంటున్నారని అమరావతి పరి రక్షణ సమితి దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన ధర్మాసనం ఈ విధంగా పేర్కొనింది.

పాదయాత్రకు మద్ధతు తెలిపేవారు రోడ్డుకు ఇరువైపులా మాత్రమే ఉండాలని ధర్మాసనం ఆదేశించింది. గతంలో పాదయాత్రకు ఏ వాహనాలకు అనుమతి ఉందో అవే ఉండేలా చూడాలని పోలీసులకు సూచించింది. రైతులకు పోటీగా ఇతరుల నిరసనలకు తావులేకుండా పోలీసులే చూసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. పాదయాత్ర ప్రశాంతంగా జరిగే విధంగా పోలీసులు చూడాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

పాదయాత్ర పై ఎవరైనా నిరసనలు, సమావేశాలు నిర్వహించాలంటే ముందస్తుగా పోలీసుల అనుమతి తీసుకోవాలని కోర్టు పేర్కొనింది. పాదయాత్ర రైతులు రెచ్చగొట్టేలా మాట్లాడారని ప్రభుత్వ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పాదయాత్ర సజావుగా సాగేలా, పోలీసులు సహకరించేలా ఆదేశించాలని న్యాయస్ధానాన్ని పిటిషనర్ తరుపు న్యాయవాది కోర్టును కోరారు.

కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రుల రెచ్చగొట్టే ప్రకటనల పై వచ్చిన పిటిషన్ లను కలిపి వింటామని హైకోర్టు పేర్కొనింది.

ఇది కూడా చదవండి: Amaravati JAC: వైసీపీ నేతలు అడ్డుకోవడం పై హైకోర్టులో పిటిషన్ వేసిన పాదయాత్ర రైతులు

Exit mobile version