Site icon Prime9

Somu Veerraju: ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరు మార్పు సరికాదు

NTR Health Varsity name change is not correct

NTR Health Varsity name change is not correct

Amaravati: ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరును వైఎస్ఆర్ హెల్త్ వర్శిటీగా పేరు మార్చడం పై భాజాపా అధ్యక్షుడు సోము వీర్రాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైద్య కళాశాలలన్నింటీని ఒకే గొడుగు కిందకు తెచ్చిన ఘనత ఎన్టీఆర్ ది అని వ్యాఖ్యానించారు. ఆరోగ్య విశ్వ విద్యాలయం నెలకొల్పింది కూడా ఆయనేని నేటి ప్రభుత్వం గుర్తించకపోవడం దారుణమన్నారు.

జగన్ ప్రభుత్వం దొడ్డిదారిన ఎన్టీఆర్ పేరు తొలగించిందని సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు చెప్పడం పరిపాటిగా మారిందని విమర్శించారు. వర్శిటీ పేరు మార్పును రాష్ట్ర భాజపా తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలిపారు.

పేరు మార్పు పై నిరసిస్తూ ఇప్పటికే అధికార భాషా సంఘం అద్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మరో వైపు మహా నేత ఎన్టీఆర్ పేరు తొలగింపు పై లక్ష్మీ పార్వతి ఏ మేరకు స్పందిస్తుందో వేచి చూడాలి. ఎందుకంటే పలు సందర్భాలలో ఎన్టీఆర్ ను చంద్రబాబు వెన్నుపోటుతో పొడిచారని ఆమె వ్యక్తం చేసివున్నారు. ఇప్పుడు జగన్ తీసుకొన్న నిర్ణయం పై లక్ష్మీ పార్వతి, ఈ విషయంలో సర్దుకొని పోతారా అని వేచిచూడాలి.

ఎన్టీఆర్ పై అభిమానం ఉంటుంది అంటూనే నేడు జగన్ అండ్ టీం అసెంబ్లీలో మాట్లాడిన విధానం పై సినీ ప్రముఖుల్లో కూడా భారీ యెత్తున చర్చ సాగుతున్నట్లు సమాచారం.

Exit mobile version