Site icon Prime9

NTR Health University: హెల్త్ యూనివర్సిటీ పేరు తొలగింపు పై ఎన్టీఆర్ ఫ్యామిలీ అసంతృప్తి

Ramakrishna

Ramakrishna

Nandamuri Family: డాక్టర్ ఎన్టీఆర్ మెడికల్ హెల్త్ యూనివర్సిటీ పేరును తొలిగించటం పై దివంగత ఎన్టీఆర్ కుటుంబం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. దీనిపై ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ ఒక ప్రకటన విడుదల చేసారు.

డాక్టర్ ఎన్టీఆర్ మెడికల్ హెల్త్ యూనివర్సిటీ పేరును తొలిగించటం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ యూనివర్సిటీకి మూల కారకుడు, వ్యవస్థాపకుడు మన అన్న స్వర్గీయ నందమూరి తారకరామా రావు గారు, అన్ని మెడికల్ కాలేజీలు ఒకే పాలసీతో నడవాలనేది వారి భావన. ఈ ఉద్దేశముతో 1986 లో స్వర్గీయ నందమూరి తారకరామా రావు గారు మెడికల్ హెల్త్ యూనివర్సిటీని స్థాపించారు. మెడికల్ హెల్త్ యూనివర్సిటీని అందరు, అన్ని రాజకీయ పార్టీలు, నాయకులు వారి వారి మద్దతు హర్షం వ్యక్తం చేశారు. నందమూరి తారకరామా రావు గారు 1996లో స్వర్గస్థులయ్యారు.

అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ స్థాపించారు. కాబట్టి ఎన్టీఆర్ అనే పదాన్ని సమకూర్చి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరుగా నామకరణం చేశారు.
రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ మీదున్న అభిమానం గౌరవంతో “డాక్టర్” ఎన్టీఆర్ మెడికల్ హెల్త్ యూనివర్సిటీగా నామకరణం చేశారు. అదే పేరును మార్చటం దురదృష్టకరం. ఎన్టీఆర్ పేరును తొలిగించటం యావత్ తెలుగు జాతిని అవమానించినట్లే. అన్ని పార్టీలకు, ప్రాంతాలకు, కులాలకు చెందిన మహా నాయకుడు యుగపురుషుడు ఎన్టీఆర్. మన తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని కాపాడి పునర్జింప చేసిన మహా నాయకుడు, తెలుగు ముద్దుల బిడ్డ మన ఎన్టీఆర్. వారి పేరు డాక్టర్ ఎన్టీఆర్ మెడికల్ హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీగా కొనసాగించాలంటూ రామకృష్ణ కోరారు.

Exit mobile version
Skip to toolbar